మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు.అయితే ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేసేందుకు ఏ స్టార్ హీరో సైతం ఖాళీగా లేడు.
ఇది కాకతాళీయంగా జరిగినా కూడా త్రివిక్రమ్‌కు ఇది కాస్త చేదు అనుభవమే అని చెప్పాలి.ఇక స్టార్స్ ఎవరు ఖాళీగా లేక పోవడంతో చిన్న హీరోలతో అడ్జస్ట్ అవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే నితిన్ లేదా నాగచైతన్యతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
నితిన్‌తో సినిమా చేయమని త్రివిక్రమ్‌కు పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చాడని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఇటీవలే నాగచైతన్యకు త్రివిక్రమ్ స్టోరీ కూడా వినిపించాడు అంటూ మరి కొందరు అంటున్నారు.
వీరిద్దరిలో ఎవరికి త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా స్టార్స్ అయిపోవడం ఖాయం.ఆ అవకాశం తమ హీరోకే రావాలంటే తమ హీరోకే రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అతి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.ఇక త్రివిక్రమ్ చేయబోతున్న ఈ సినిమాను సైతం రాధాకృష్ణ నిర్మించబోతున్నాడు.