'అఆ' లాంటి సినిమాతో త్రివిక్రం మరోసారి..!

అఆలు దిద్దిస్తూ ఈ ఇయర్ సమ్మర్ హాలీడేస్ కు హ్యాపీ ఎండింగ్ పలికిన త్రివిక్రం శ్రీనివాస్ అఆ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఇక సక్సెస్ మీట్ లో చెప్పినట్టుగా ఇదో చారన్నం లాంటి సినిమా.

 Trivikram Again Planing Movie Like A Aa.-TeluguStop.com

దీన్ని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు.సస్పెన్స్ .ట్విస్ట్ లు.వయిలెన్స్ ఇవేమి లేకుండా కూల్ హిట్ అందుకున్న త్రివిక్రం శ్రీనివాస్ మరోసారి అలాంటి సినిమాతోనే వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.

ప్రస్తుతం తన లిస్ట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ డాలితో సినిమాకు రెడీ అవుతున్నాడు.అల్లు అర్జున్, మహేష్ లు ఆల్రెడీ వేరే సినిమాలు కమిట్ అయ్యారు.

కాబట్టి పవన్ కోసం నాలుగు నెలలు ఆగే ప్రయత్నంలో మరోసారి అఆలాంటి కథతో మరో చిన్న సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రం.అఆ కూడా ఫ్లాట్ కథే కాని నితిన్, సమంత లాంటి భారీ కాస్టింగ్ ఉంది.

కాని వచ్చే సినిమా అంతలా కూడా ఉండకుండా చేసేలా చూస్తున్నాడట.

ఇక త్రివిక్రం సినిమాలన్ని రాధాకృష్ణ నిర్మాణంలోనే అని ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.

త్రివిక్రం రెడీ అంటే చాలు తాను రెడీ అనేస్తాడు నిర్మాత చినబాబు.సో మరికొద్ది రోజుల్లో త్రివిక్రం సినిమా ఎనౌన్స్ మెంట్ రానున్నదన్నమాట.

అఆ లాంటి సినిమా అంటే త్రివిక్రం మరోసారి చారన్నం తినిపిస్తాడో లేదో చూడాలి మరి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube