కోర్టు మెట్లు ఎక్కుతున్న త్రిష .. పాత వివాదం మళ్ళీ తెరమీదకి

రాజకీయ నాయకులు, సినిమా తారలు, స్పోర్ట్స్ స్టార్స్, వ్యాపారవేత్తలు .ఈ దేశంలో ఎక్కువ డబ్బు సంపాదించేది ఈ నలుగురే.

 Trisha’s Income Tax Controversy Makes Into Court Again-TeluguStop.com

పెద్ద మొత్తంలో సంపాదించడం, సంపాదనని తక్కువ చూపడం, ట్యాక్స్ తక్కువ కట్టడం, ఈ నాలుగు ప్రపంచాల్లో బ్రతుకుతున్న బడా మనుషులకి చాలా కామన్.దాదాపుగా అందరు చేసే పనే, కొందరు దొరుకుతారు, కొందరు దొరకరు అంతే.

ఇప్పుడు త్రిష దొరికిపోయింది.కోర్టు మెట్లు మళ్ళీ ఎక్కనుంది.

విషయంలోకి వెళ్తే, 2010-2011 సంవత్సరంలో త్రిష తన ఆదాయాన్ని 89 లక్షలుగా చూపింది.కేవలం ఆ ఏడాది తన చేతిలోకి వచ్చిన ఫుల్ పేమెంట్స్ మాత్రమే బయటకి చెప్పి, తీసుకున్న అడ్వాన్సులని మాత్రం గోప్యంగా ఉంచింది.

నిజానికి అడ్వాన్స్ కూడా ఆదాయం కిందికే వస్తాయి.దాంతో అనుమానాలు వ్యక్తపరిచిన ఐటి అధికారులు త్రిషపై రేడ్ చేసారు.అప్పుడు త్రిష ఆ ఏడాది సంపాదించింది 89 లక్షలు కాదు, 3.5 కోట్లు అని తేలింది.తప్పుడు లెక్కలు చూపించినందుకు గాను త్రిషపై 1.15 కోట్ల జరిమానా విధించారు.

అప్పుడు త్రిష తన లాయర్ ని ఆశ్రయించి ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళింది.ఐటి అధికారుల పనితీరుని తప్పుబడుతూ, తాను సరైన లెక్కలు చూపిస్తూ పన్ను చెల్లించినా ఇన్కంటాక్స్ ట్యాక్స్ వారు కేసులో ఇరికించారని తన వాదన వినిపించింది.

త్రిషకి అనుకూలంగా స్పందించిన కోర్టు జరిమానాను రద్దు చేసింది.అయితే ఈ వివాదం ఇక్కడితే ఆగిపోయింది అని త్రిష ఊపిరి పీల్చుకున్నా, ఇన్కంటాక్స్ అధికారులు మళ్ళీ ఈ వివాదాన్ని తెరమీదకి తీసుకొచ్చారు.

ఆదాయపన్ను శాఖ త్రిషపై విధించిన 1.15 కోట్ల జరిమానాని ట్రిబ్యునల్ కోర్టు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అధికారులు మద్రాసు హైకోర్టులో కొత్తగా పిటిషన్ వేసారు.ఈ కేసు విచారణ త్రిష హాజరులో ఈ నెల 13న జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube