కంటి రెప్ప మీద కురుపును తగ్గించుకోవటానికి సమర్ధవంతమైన నివారణ మార్గాలు

సాదారణంగా కన్ను రెప్ప మీద కురుపు అనేవి రహస్య గ్రంథులకు ఇన్ఫెక్షన్ రావటం వలన సంభవిస్తాయి.ఇవి రావటానికి అంతర్గత కారకాలు లేదా బాహ్య కారకాలు కారణం కావచ్చు.

 Treatment Options For Swollen Eyelids-TeluguStop.com

కంటి రెప్ప మీద కురుపు వేసినప్పుడు దురద, ఎరుపు, కంటి మీద చిన్న ఎరుపు చుక్క వంటి లక్షణాలు కనపడతాయి.ఈ కంటి కురుపును తగ్గించుకోవటానికి అనేక సులభమైన మరియు ప్రభావవంతమైన నివారణలు ఉన్నాయి.

1.గోరువెచ్చని నీరు

ఇది కంటి రెప్ప మీద కురుపు చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అలాగే వేగంగా మరియు తక్షణ ఉపశమనం పొందడానికి ఈ నివారణను ప్రయత్నించవచ్చు.

కావలసినవి
శుభ్రమైన పలుచని క్లాత్
గోరువెచ్చని నీరు – 1 కప్పు

పద్దతి

గోరువెచ్చని నీటిలో పలుచని క్లాత్ ని ముంచి నీటిని పిండి, కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద ఆ క్లాత్ ని పది నిముషాలు ఉంచాలి.

ఈ ప్రక్రియను రోజుకి నాలుగు సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి.ఈ సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం కంటి మంటను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

2.జామ ఆకులు

జామ ఆకులు కంటి కురుపు చికిత్సలో సులభంగా మరియు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.అలాగే కంటి నొప్పి కూడా వేగంగా తగ్గుతుంది.

కావలసినవి
జామ ఆకులు – 2-3
నీరు – 1 కప్పు
శుభ్రమైన తెల్లని పలుచని వస్త్రం

పద్దతి
నీటిని బాగా మరిగించి దానిలో జామ ఆకులను వేసి పది నిముషాలు మరిగించాలి.

ఈ జామ ఆకుల నీరు గోరువెచ్చగా అయ్యాక, దానిలో పలుచని క్లాత్ ని ముంచి నీటిని పిండి, కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద ఆ క్లాత్ ని ఐదు నిముషాలు ఉంచాలి.ఈ ప్రక్రియను రోజుకి నాలుగు సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి.

3.ఉల్లిపాయ

ఉల్లిపాయలో యాంటీ- వైరల్ లక్షణాలు అధిక మొత్తంలో ఉన్నాయి.అందువలన ఫ్లూ మరియు ఇన్ఫెక్షన్ చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఉల్లిపాయలో ఉన్న ఈ లక్షణం కారణంగా కంటి కురుపును వేగంగా నయం చేయటంలో సహాయపడుతుంది.

కావలసినవి
ఉల్లిపాయ
చాకు

పద్దతి
ఉల్లిపాయను ముక్కగా కోసి కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద పెట్టి రెండు నిముషాలు ఉంచాలి.ఈ ప్రక్రియను రోజులో 2-3 సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి.

4.టీ బ్యాగ్

ఇది ప్రభావవంతమైన మూలికా చికిత్సలో ఒకటిగా ఉంది.

ఇది బాధాకరమైన కంటి వ్యాధి నుండి తక్షణ ఉపశమనం మరియు రెప్ప కురుపు నుండి చీమును తొలగించటానికి సహాయపడుతుంది.టీ లో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో బాక్టీరియా మరియు వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా
సహాయపడుతుంది.

కావలసినవి
హెర్బల్ టీ బ్యాగ్ – 1
నీరు – 1 కప్పు

పద్దతి

నీటిని మరిగించి దానిలో టీ బ్యాగ్ ని వేసి 4 నుంచి 5 నిముషాలు అలా ఉంచాలి.నీరు గోరువెచ్చగా అయ్యాక టీ బ్యాగ్ ని నీటి నుండి తీసి పిండి కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద పెట్టి రెండు నిముషాలు ఉంచాలి.

ఈ ప్రక్రియను రోజులో 2-3 సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube