Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మగవాడే .. కాని మరో మగవాడి వలన గర్భం దాల్చాడు -Transgender Man Is Healthily Pregnant After A Miscarriage

ఇష్టమైనవారితో జీవితాన్ని పంచుకోవడం, తనతో పిల్లల్ని కని వారిని మురిపెంగా పెంచుకోవడం. ఇదే కదా జీవితం నుంచి ప్రతి ఒక్కరు ఆశించేది. కాని ఇది స్ట్రెయిట్ కపుల్ కి మాత్రమే సాధ్యపడే విషయం అని అనుకుంటారు అంతా. స్వలింగ సంపర్కులు ఇలాంటి జీవితాన్ని చూడలేరు అని తిట్టిపోస్తుంటారు. బాయోలాజికల్ గా స్వలింగసంపర్కులు పిల్లల్ని కనడం సాధ్యపడే విషయం కాదు. అందుకే లేస్బియన్స్, గే కపుల్స్ ఎక్కువగా పిల్లలని దత్తత తీసుకుంటారు. లేస్బియన్స్ అయితే ఒక్కోసారి వీర్యదాత నుంచి వీర్యాన్ని తీసుకొని పిల్లల్ని కని, వారినే సొంత పిల్లలాగా చూసుకుంటారు. ఇలాంటి స్వలింగ సంపర్కులు ఒకవైపు. మరోరకం స్వలింగ సంపర్కులు ఏం చేస్తారంటే, పార్టనర్స్ ఇద్దరిలో ఒకరు లింగ మార్పిడి చేసుకుంటారు. అంటే ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు అబ్బాయిలాగా మారడం లేదంటే ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు అమ్మాయిలా మారడం అన్నమాట.

ఈ రెండోరకం స్వలింగ సంపర్కులే ఈ ఫోటోలో కనిపిస్తున్నవారు. ఈ ఫోటోలో పొట్ట వేసుకొని కనిపిస్తున్న అబ్బాయి (అమ్మాయి) పేరు ట్రిస్టాన్. కాని అది పొట్ట కాదు, గర్భం. వీరిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు. కాని ఫ్యామిలి అన్నప్పుడు పిల్లలు కూడా కావలి కదా. అందుకే ఓ బాబుని, ఓ పాపని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. వారిద్దరి మీద ప్రేమ ఉన్నా, ఎందుకో వీరికి బయోలాజికల్ సంతానం కావాలి అనిపించిందట. అందుకే ట్రిస్టాన్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు. కాని దురదృష్టవశాత్తూ మొదటి గర్భం మధ్యలోనే కనుమూసింది. కాని వీరు అధైర్యపడలేదు. మళ్ళీ ప్రయత్నించారు. ఈసారి సక్సెస్.

ట్రిస్టాన్ మళ్ళీ గర్భం దాల్చాడు. కాని ఈసారి అంతా సాఫీగా సాగుతోంది. బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. త్వరలోనే డెలివరి ఉంటుంది. ఈ వార్త కలిగిస్తున్న ఆనందం మాటల్లో చెప్పలేనిది అంటున్నాడు ట్రిస్టాన్. రోజు జనాలు వెక్కిరిస్తారని గర్భం కనబడకుండా పెద్ద పెద్ద కోటు వేసుకొని ప్రయాణించడం ట్రిస్టాన్ కి అలవాటు. ఇంకొన్నిరోజులు గడిస్తే అంతలా కష్టపడాల్సిన అవసరం లేదని మురిసిపోతున్నాడు.

Continue Reading
More Posts
To Top