జియోపై చాడీలు చెబుతున్న ఎయిర్ టెల్-Airtel Urges TRAI To Review JIO’s Free Voice Calls Offer 3 months

Airtel Urges TRAI To Review JIO's Free Voice Calls Offer Jio Reliance Photo,Image,Pics-

జియో రావడంతో మిగితా కంపెనీలన్ని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్న వార్త కొత్తది కాదు. అందరికన్నా ఎక్కువ మార్కేట్ లీడర్ ఎయిర్ టెల్ కష్టపడుతోంది. నెం.1 స్థానం నుంచి కింద పడిపోతామన్న భయం కలిగిందో ఏమో, నిన్న TRAI (Telecom Regulatory Authority of India) కి జియో మీద కంప్లయింట్స్ ఇచ్చింది ఎయిర్ టెల్ సంస్థ.

అసలు ఈ వైరం ఇంత దారుణ స్థితికి ఎలా పడిపోయిందంటే, ఈ నెల 21వ తేదిన ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలపై 3050 కోట్ల ఫైన్ విధించింది TRAI. ఈ జరిమానా ఊరికే ఏం పడలేదు. జియో కాల్స్ సరిగా కనెక్ట్ కావడం లేదుగా. దీనికి కారణం ఈ కంపెనీలు జియోకి అవసరమైన PoIs ఇవ్వకపోవడమే.

ఉచిత కాల్స్ తమ కంపెనీలను దెబ్బతీస్తున్నాయి, ఇలా ఎన్నిరోజులు నడుస్తుంది, జీవితకాలం కాల్స్ ఉచితంగా ఎలా ఇస్తారు, TRAI ఈ విషయం మీద ఆలోచించాలి అని కంప్లయింట్ చేసిన ఎయిర్ టెల్ అధిపతి సునీల్ మిట్టల్, గవర్నమెంటుని, TRAI ని గౌరవించి జరిమానా కట్టడమే కాదు, జియోకి అవసరమైన PoIs అందిస్తానని ప్రకటించింది ఎయిర్ టెల్.

ఈరకంగా భారతీయ టెలికాం రంగం రెండు వర్గాలుగా చీలిపోయింది. కేవలం రిలయన్స్ ఒకవైపు, మిగితా టెలికాం కంపెనీలన్ని మరోవైపు అయిపోయాయి. జియో కాల్స్ సరిగా కనెక్ట్ అవడం మొదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు జరుగుతాయో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. క్రికెట్ బెట్టింగ్ లో భార్యని పణంగా పెట్టాడు...

About This Post..జియోపై చాడీలు చెబుతున్న ఎయిర్ టెల్

This Post provides detail information about జియోపై చాడీలు చెబుతున్న ఎయిర్ టెల్ was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

Airtel urges TRAI to review JIO's free voice calls offer, JIO, 3050Crores, Airtel, Free Calls, Reliance, Jio Free Calls Offer

Tagged with:Airtel urges TRAI to review JIO's free voice calls offer, JIO, 3050Crores, Airtel, Free Calls, Reliance, Jio Free Calls Offer3050Crores,airtel,Airtel urges TRAI to review JIO's free voice calls offer,Free Calls,Jio,Jio Free Calls Offer,reliance,,