ఇంటర్నెట్ యూజర్లు భరించలేని బ్యాడ్ న్యూస్

ఇంటర్నెట్ రెగ్యులర్ గా వాడేవారికి టొరెంట్స్ అంటే ఏంటో కొత్తగా చెప్పనక్కరలేదు.అందులోనూ Torrentz.

 Torrentz Shut Down – Internet Users Heart Goes Out-TeluguStop.com

eu గురించి అస్సలు చెప్పనక్కరలేదు.ఏదైనా సినిమా థియేటర్లో చూడాలనిపించక పోతే, ఒకటిరెండు రోజుల్లో టొరెంట్జ్ లో దొరికేది.

ఏదైనా పాత సినిమా డవున్లోడ్ చేసుకోవాలనిపిస్తే టొరెంట్జ్ లో దొరికేది.మన అభిమాన ఇంగ్లీష్ సినిమాలు, హిందీ, తమిళం, మలయాళం .ఇలా ఇతర భాషల సినిమాలు ఏం చూడాలన్నా టొరెంట్జ్ లో దొరికేవి.

కొన్ని వీడియో గేమ్స్ బయట కొనాలంటే వేలల్లో ఖర్చుపెట్టాలి.

రకరకాల సాప్ట్‌వేర్ కావాలన్నా వేలు పెట్టి కొనాలి.ఇన్నిరకాల ఖర్చులు తప్పించింది టొరెంట్జ్.

అన్నిటి పైరసి అక్కడే దొరికేది.కాని ఇకనుంచి ఆ వీలు లేకుండాపోయింది.

Torrentz.eu మూతపడింది.అవును … 2003 నుంచి మనకు టోరెంట్ ఫైల్స్ ని అందిస్తున్న టొరెంట్జ్ వెబ్ సైట్ ఇప్పుడు పనిచేయట్లేదు.“Torrentz will always love you.Farewell” అనే సందేశంతో తన యూజర్లకు వీడ్కోలు పలికింది.అసలే మొన్నటికి మొన్న కిక్ ఆస్ టొరెంట్స్ యజమానిని పట్టుకోని ఆ సైట్ ని కూడా మూసేసారు.

అది మరచిపోకముందే ఇంటర్నెట్ యూజర్లకు ఇలా కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఇకనుంచి మనకు ఏదైనా ఇతర భాష సినిమా చూడాలనిపిస్తే డివిడి కొనుక్కోవాల్సిందేనేమో.

వీడియో గేమ్, సాప్ట్‌వేర్ .ఏది ఉచితంగా దొరక్కపోవచ్చు.ఆన్ లైన్ పైరసికి ఇది పెద్ద ఉపశమనమే కావచ్చు .కాని ఎన్నోరకాలుగా ఉపయోగపడ్డ టొరెంట్జ్ ఇకలేదనే వార్తని మాత్రం ఇంటర్నెట్ యూజర్స్ జీర్ణించుకోవడం కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube