Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హీరోయిన్ ని సెక్స్ అడిగిన ఆ హీరో ఎవరు?-Who Asked Archana For Sexual Favour?

తెరపై వచ్చిన తొలినాళ్ళలో సందడి చేసి, ఆ తతరువాత కనుమరుగైపోయిన మరో తెలుగు అమ్మాయి అర్చన (వేద). అల్లరి నరేష్ నేను చిత్రంతో పరిచయమైన అర్చన, ఆ తరువాత వంశీ దర్శకత్వంలో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే చిత్రాన్ని చేసింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో చేసిన పాత్రతో బాగా పాపులర్ అయిన ఈ అమ్మాయి, కొన్ని పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది.

మగధీరలో సలోని చేసిన పాత్రను రిజెక్ట్ చేసి తప్పు చేసానని ఈమధ్యే ఓ ఇంటర్వూలో చెప్పిన అర్చన, తన సీనిజీవితంలో జరిగిన ఓ షాకింగ్ నిజాన్ని కూడా బయటపెట్టింది. ఓ ప్రముఖ హీరో తనకి హీరోయిన్ గా అవకాశమిచ్చాడట. అయితే, ఆ సినిమా షూటింగ్ తొలిరోజే, డబుల్ మీనింగ్ లో “నేను నీకు అవకాశమిచ్చాను కదా, మరి నువ్వు నాకేం ఇస్తావ్” అని అర్చనని అడిగాడట ఆ హీరో. ఆయనగారి మాటలకు అర్థాన్ని బాగా అర్థం చేసుకున్న అర్చన సున్నితంగా దాన్ని తిరస్కరించడంతో, ఆ మూవిలో తన సీన్స్ లేకుండా చేసేసారట.

అయితే ఆ హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు అర్చన. క్యారక్టర్ పాత్రలు చేయడం వలనే తన కెరీర్ నాశనమయ్యిందని చెప్పుకొచ్చింది ఈ తెలుగమ్మాయి. మీకు తెలిసిన విషయమే, యమదొంగలో చేసిన ఐటమ్ సాంగ్ కూడా అర్చన కెరీర్ కి ఉపయోగపడలేదు.

Continue Reading
More Posts
To Top