అత్యధిక సంపాదన కలిగిన టాప్ 10 క్రికెటర్లు .. వారి వార్షిక ఆదాయం

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు ఏది అంటే వెంటనే భారత క్రికెట్ బోర్డు అని చెప్పేస్తారు.మరి అత్యధిక సంపాదన గల టాప్ క్రికెటర్స్ అంతా భారతీయులేనా ? అసలు టాప్ 10 ఎవరెవరు ఉన్నారు ? ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారు ? ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్ ఎవరు ? అన్ని సమాధానాలు మా దగ్గర ఉన్నాయి.అత్యధిక సంపాదన కలిగిన టాప్ 10 క్రికెటర్స్ ఎవరో .వారు ఎంత సంపాదిస్తున్నారో చూడండి.

 Top 10 Highest Earning Cricketers In The World Right Now-TeluguStop.com

10.షేన్ వాట్సన్ :

రిటైర్ అయిపోయాడు కాని, ఇంకా లీగ్స్ ఆడుతున్నాడు.ఐపిఎల్ ఒకటే కాదు, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరిబిఎన్ లీగ్ .ఇలా తేడా లేకుండా ఆడుతున్నాడు.ఐపిఎల్ లో పోల్చుకుంటే మిగితా లీగ్స్ లో వచ్చేది చిల్లరే అయినా, షేన్ వాట్సన్ ఇంకా సంపాదిస్తున్నాడు.ఇతడి వార్షిక ఆదాయం 11 కోట్లు.

9.స్టీవ్ స్మీత్:

ప్రపంచ అగ్రేశ్రేణి బ్యాట్స్ మెన్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ళ లిస్టులో చివరి ర్యాంకులో ఉన్నాడు.తానే సారధి అయినా, తనకన్నా ఎక్కువ సంపాదించే వారు తన జట్టులోనే ఉన్నారు.ఐపియల్ లో పూణే జట్టుకి సారధ్యం వహించే ఈ టాప్ బ్యాట్స్ మెన్, తన ఆదాయంలో అధిక శాతం లీగ్ ద్వారానే పొందుతాడు.ఇతడి వార్షిక ఆదాయం 16 కోట్ల పైన ఉంది.

8.గౌతమ్ గంభీర్ :

భారత జట్టులో గంభీర్ కి చోటు దక్కట్లేదు.అయినా టాప్ 10 లో ఉన్నాడంటే కారణం ఐపిఎల్.

కోల్కతా నైట్ రైడర్స్ సారధి కావడంతో షారుఖ్ ఖాన్ గంభీర్ కి పెద్ద మొత్తమే చేల్లిస్తాడు.ఇతని ఆదాయం కూడా ఏడాదికి 16 కోట్ల పైనే.

7.యువరాజ్ సింగ్ :

ఒకప్పుడు ఊపు లేకపోయినా, తన పాపులారిటి చాలావరకు పడిపోయినా, యువరాజ్ ఆదాయం, ఇప్పటికి ఫర్వాలేదు అన్నట్టుగానే ఉంది.యువరాజ్ ఆదాయం ఏడాదికి పాతిక కోట్లు.అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడున్నర కోట్లు చెల్లిస్తే, మిగితావి బ్రాండ్స్ మరియు అంతర్జాతీయ క్రికెట్ ద్వారా సంపాదిస్తున్నాడు.

6.డేవిడ్ వార్నర్ :

ఆస్ట్రేలియాకి ఆడుతున్నందుకు డేవిడ్ వార్నర్ అందుకునేది తక్కువ అమౌంటే.ఎంత అంటే ఓ కోటిన్నర వస్తుంది.ఇతగాడి జేబులో ఎక్కువ డబ్బు పెట్టేది సన్ రైజర్స్ హైదరబాద్ యాజమాన్యమే.ఎంతైనా హైదరాబాద్ కెప్టెన్ కదా.లెక్కల్లో ఇంతని ఐపిఎల్ పారితోషికం అయిదున్నర కోట్లే అయినా, హైదరాబాద్ యాజమాన్యం 12-15 కోట్లు చెల్లిస్తుందట.ఇక యాడ్స్ కలుపుకొని 26 కోట్ల దాకా వెనకేసుకుంటున్నాడు వార్నర్.

5.ఎబి డివిలియర్స్ :

మిస్టర్ 360 డిగ్రీస్ ఏడాదికి సంపాదిస్తున్నది 32 కోట్ల పైనే.ఇందులో 13 కోట్ల దాకా సౌతాఫ్రికా బోర్డు చేల్లిస్తుండగా, మిగితా మొత్తం ఐపిఎల్ మరియు యాడ్స్ ద్వారా వస్తుంది.

4.క్రిస్ గేల్:

విధ్వంసకర బ్యాట్స్ మెన్ గేల్ వార్షిక ఆదాయం దాదాపుగా 35 కోట్లు.బోర్డు ద్వారా దొరికేది తక్కువే అయినా, ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్స్ ఆడటం ద్వారా పెద్ద మొత్తాల్ని అందుకుంటాడు.యాడ్స్ ప్రపంచంలో కూడా డిమాండ్ ఎక్కువ.

3.సచిన్ టెండూల్కర్ :

ఎప్పుడో 2011 లో రిటైర్ అయ్యాడు.అయినా ఆ క్రేజు తగ్గలేదు.క్రికెట్ ఆట ఆడకపోయినా, ఇంకా కంపెనీలు సచిన్ వెంట పడుతున్నాయి.కేవలం యాడ్స్ ద్వారానే ఏడాదికి 60 కోట్ల దాకా సంపాదిస్తున్నాడు మాస్టర్ బ్లాస్టర్.

2.ధోని :

గత ఏడాది దాకా అత్యధిక సంపాదాన గల క్రికెటర్ గా ఉంటూ వచ్చాడు ఈ భారత మాజీ కెప్టెన్.కాని ఇప్పుడు తను నెం.2 స్థానానికి పడిపోయాడు.అయితే ఇక్కడ ధోని సంపాదన తగ్గలేదు.నెం.1 ఆటగాడి సంపాదన విపరీతంగా పెరిగింది అంతే.ప్రస్తుతం ధోని ఏడాదికి సంపాదిస్తున్నది 140 కోట్లు.

1.విరాట్ కోహ్లి :

మీకు తెలిసిన విషయమే.పూమాతో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తరువాత ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్ గా ఎదిగాడు కోహ్లి.

కేవలం బ్యాట్ మీద స్టికర్ వాడుతున్నందుకు MRF సంస్థ ప్రతి ఏడాది 12 కోట్లు చెల్లిస్తోంది అంటే అర్థం చేసుకోండి కోహ్లి రేంజ్ ఏంటో.బోర్డు కాంట్రాక్ట్, యాడ్స్, ఐపిఎల్ .అన్ని కలిపి కోహ్లి ఏడాదికి సంపాదించేది 200 కోట్ల పైమాటే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube