టాప్ 10 క్రికెట్ విడియో గేమ్స్ ఇవే

10) Ashes Cricket 2009 :

హాక్ ఐ టెక్నిక్ ని ఉపయోగించిన మొదటి క్రికేట్ గేమ్స్ లో ఇది కూడా ఒకటి.షాట్స్ ఎక్కువే ఉన్నాయి.

 Top 10 Cricket Games For Mobiles And Computers-TeluguStop.com

కెమెరా యాంగిల్స్ ఫర్వాలేదు.ఆటగాళ్ళ జేర్సీలు సూపర్.ఇది కంప్యూటర్స్ కి అందుబాటులో ఉంది.

9) Stick Cricket:

భారి గ్రాఫిక్స్ ఉండవు.అఫీషియల్ జేర్సీలు ఉండవు.స్టిక్ ఫార్మాట్ మొబైల్ గేమ్స్ లో ఎంత పాపులరో మీకు తెలియనిది కాదు.టైంపాస్ బాగా అయ్యే గేమ్.మీ మొబైల్ కి అందుబాటులో ఉంటుంది.

8) ICC Cricket PRO:

ఈ గేమ్ ని విడుదల చేసింది సాక్షాత్తు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.మొబైల్ యూజర్స్ దీన్ని ఆడవచ్చు.

పేరుకి అఫీషియల్ గేమ్ అన్నట్లే కాని గ్రాఫిక్స్ బాగుండటమే అంత గేమ్ కంట్రోల్స్ సరిగా లేని గేమ్ ఇది.ముఖ్యంగా బౌలింగ్ వేసేటప్పుడు చాలా కష్టం.అయినా, ఆఫీషియల్ గేమ్ కాబట్టి ఆసక్తి ఉంటే ప్రయత్నించండి.

7) International Test Cricket:

నడుస్తున్నది టీ20ల జమానా కావచ్చు.అయినా ఇప్పటికి టెస్టు క్రికెట్ ప్రేమికులు ఉన్నారు.ఎంతైనా క్రికెట్ మొదలైనదే టెస్టు ఫార్మాట్ తో కదా.అలాంటి టఫ్ ఫార్మాట్ యొక్క టఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి.

6) International Cricket Captain 2012:

కలర్ ఫుల్ గా ఉండే గేమ్ ఇది.గ్రాఫిక్స్ బాగుంటాయి.విండోస్ కి అందుబాటులో ఉంది.

కెమెరా యాంగిల్స్ బాగుంటాయి.జేర్సీలు కలర్ ఫుల్ గా ఉంటాయి.

5 Brain Lara International Cricket 2007 :

క్రికెట్ మీద పాపులర్ విడియో గేమ్స్ లో ఇది కూడా ఒకటి.గ్రాఫిక్స్ అండ్ కెమెరా వర్క్ ఇప్పుడొస్తున్న గేమ్స్ తో పోల్చుకుంటే కొంచెం అవుట్ డేటెడ్ గా అనిపించవచ్చు కాని గేమ్ కంట్రోల్స్ బాగుంటే చాలు అనుకునేవారు ఇది ఆడొచ్చు.ఇందులో వరల్డ్ కప్ ఆడటంలో ఉన్న మజానే వేరు.

4) Brain Lara International Cricket 2005 :

సచిన్, గంగూలి, ద్రావిడ్, లక్ష్మణ్, కుంబ్లే, జహీర్ ఖాన్ … ఇలాంటి ఆటగాళ్ళపై ఇంకా ప్రేమ తగ్గలేదా ? అయితే ఈ గేమ్ ని డౌన్లోడ్ చేసుకోండి.మీరు వెంటనే చిన్నతనంలోకి వెళ్ళిపోతారు.ఇది కేవలం కంప్యూటర్స్ కోసమే.

3) EA Cricket:

ఇప్పటివరకు వచ్చిన అన్ని క్రికెట్ గేమ్స్ లోకి అత్యంత పాపులర్ గేమ్ ఇదే.అందులో ఎలాంటి సందేహం లేదు.అయితే ఇన్నేళ్ళు మనల్ని అలరించిన ఈ గేమ్, పూర్తిగా కొత్త రూపంలో 2019 సంవత్సరంలో రానుంది.

2) World Cricket Championship 2:

ప్రసుతం మొబైల్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రికెట్ గేమ్ ఇది.అదిరిపోయే గేమ్ ప్లే, సులువైన కంట్రోల్స్, దాదాపుగా 40-50 వేరు వేరు షాట్లు .అబ్బో క్రికెట్ ప్రేమికులకి పండగే పండగ.ఇందులో టెస్టు ఫార్మాట్ ఆట ఉంటుంది చూడండి .మీరు ఆడి తీరాల్సిందే.

1) Don Bradman Cricket:

సర్ డాన్ బ్రాడ్ మాన్ పేరు పెడితే పెట్టారు కాని అదిరిపోయే గేమ్ ని అందించారు.కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, అద్భుతమైన కెమెరా వర్క్స్, కంట్రోల్స్, ఐపిఎల్, బిబిఎల్ టీమ్స్, ఆటగాళ్ళ సొంత ముఖాలు, ఏమాత్రం తేడా లేని జేర్సీలు … ఇదో అధ్బుతమైన గేమ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube