ఆ అలవాటు వలన శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి

మద్యపానం అరోగ్యానికి చాలా హానికరం.ఈ విషయాన్ని థియేటర్లో యాడ్ చూసిన చిన్న పిల్లాడు కూడా చెబుతాడు.

 Too Much Of Alcohol Will Keep Your Breathing At Risk-TeluguStop.com

అయినా ఈ అలవాటుని మానేయడం మనిషి వల్ల కావడం లేదు.ఎందుకు అంత బలహీనులవుతున్నారో చెప్పడం కష్టం కాని, తాజా అధ్యయనాల్లో తెలసిన విషయం ఏమిటంటే, మద్యపానం మీ లివర్ నే కాదు, ఊపిరితిత్తులను కూడా బలహీనపరుస్తుందట.

అవును, మద్యపానం అలవాటు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుందట.

అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నేషనల్ హెల్త్‌ ఆండ్ ఎక్జామినేషన్ సర్వే (NHANES) పరిశోధకులు ఈ విషయాన్ని తమ రిసెర్చి ద్వారా తేల్చి చెప్పారు.

ఈ రిసెర్చిలో 12వేల మందికి పైగా పాల్గొనగా, అందులో దాదాపు 27% మందికి మద్యం అతిగా తాగే అలవాటు ఉందట.ఇలాంటివారు గాలి లోనికి పీల్చుకున్నప్పడు దాంట్లో నిట్రిక్ ఆక్సైడ్ పాళ్ళు తక్కువగా ఉండటం గమనించారు పరిశోధకులు.

మద్యం తక్కువగా, లేదా పూర్తిగా తాగే అలవాటు లేనివారి కండిషన్ వీరితో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంది.

లయోలా యూనివర్సిటీ, చికాగో ప్రొఫెసర్ మాజిద్ అఫ్షర్ ఈ రీసెర్చి గురించి మాట్లాడుతూ ” మద్యం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది.

ఆస్తమా పేషెంట్ల ఊపిరిలో నిట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని పరీక్షించి అరోగ్య స్థితిని అంచనా వేయొచ్చు.అదే వారికి మద్యం బాగా తాగే అలవాటు ఉంటే, ఆ పని కూడా కష్టమైపోతుంది.

అలాగని మిగితావారికి మద్యం వలన నష్టం జరగదని కాదు .కాని ఆస్తమా లేని పేషెంట్లలో జరుగుతున్న నష్టాన్ని వివరించవచ్చు.మొత్తనికైతే జరగాల్సిన నష్టం జరిగితీరుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube