సెల్ఫీల వలన కూడా ఓ ప్రమాదం ఉంది

ఒకప్పుడు ఫోటోస్టూడియో వెళ్ళి నాలుగు గోడల మధ్య ఫోటోలు దిగాలన్నా మొహమాటంగా ఉండేది.సొంతంగా కెమెరాలు కొనడం మొదలుపెట్టాక మొహమాటం తగ్గింది.

 Too Many Selfies Can Damage Your Skin-TeluguStop.com

స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు మొహమాటమనేదే లేకుండా ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగేస్తున్నారు.ఈ సెల్ఫీల పిచ్చి యువతకు ఎంతగా పట్టుకుందంటే, ఆ పిచ్చిని వాడుకుంటూ, ప్రత్యేకమైన సెల్ఫీల కెమెరాలు అమర్చి మార్కేట్లోకి సెల్ఫీ ఎక్సపర్ట్ స్మార్ట్ ఫోన్లు వదిలేస్తున్నాయి మొబైల్ కంపెనీలు.

తెల్లారి లేస్తే గుడ్ మార్నింగ్ సెల్ఫీ, బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటున్నాం అనేది చెప్పడానికి ఓ సెల్ఫీ, సాయంత్రం షికారుకి ఓ సెల్ఫీ, రాత్రి పడుకునే ముంది కూడా ఒక సెల్ఫీ.ఇవి కాకుండా, హ్యాంగ్ ఔట్, నైట్ అవుట్, ఇలా ఏం సెలబ్రేట్ చేసుకున్నా, ఏం పని చేసినా, సెల్ఫీ తీసుకోవాల్సిందే.

కాని ఈ సెల్ఫీల వలన చర్మానికి ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు.

ఇలా మాటిమాటికి ముఖాన్ని స్మార్ట్ ఫోన్ లైట్స్ కి, రేడియోషన్ కి ఎదురుగా పెట్టడం వలన ముడతలు వచ్చి, త్వరగానే వయసు అయిపోయినట్టు కనిపించే ప్రమాదం ఉందట.

” బ్లాగర్స్, సోషల్ మీడియాలో సెల్ఫీలతో హంగామా చేసేవాళ్ళు చింతించాల్సిందే.ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే లైట్ వలన కూడా మన చర్మానికి ప్రమాదమే.

ఫోన్ నుంచి వెలువడే లైట్ మరియు రేడియేషన్ మన స్కిన్ ని డామేజ్ చేస్తాయి” అంటూ లండన్ లోని లినియా స్కిన్ క్లీనిక్ డైరెక్టర్ సైమన్ జోకే చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube