ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే

ఎలప్పుడు శుభం పలకాలి.మెగాస్టార్ చిరంజీవి ఓ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ తనదైన స్టయిల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాలి.

 Too Many Negative Sentiments For Khaidi No.150-TeluguStop.com

అందరు ఇలానే కోరుకుంటున్నారు కాని సినిమా ఫీల్ట్ లో సెంటిమెంట్స్ ఎక్కువ కదా.ఇప్పుడు ఖైదీ నం.150 చిత్రానికి కొన్ని సెంటిమెంట్లు అపశకునాల్లాగా మారాయి.

మొదట కెమెరామెన్ తో మొదలుపెడదాం.ఖైదీ నం.150 సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.భారతీయ చలనచిత్ర రంగంలో ఉన్న గొప్ప టెక్నీషియన్స్ లో ఆయన ఒకరు.కాని రోబో చిత్రం తరువాత ఆయన ట్రాక్ రికార్డే బాగా లేదు.ఆ తరువాత ఆయన మూడు పెద్ద చిత్రాలు చేసారు.అవే 1-నేనొక్కడినే, రజినీకాంత్ లింగా మరియు బ్రహ్మోత్సవం.

అన్నీ దారుణమైన పరాజయాలే.

చిరంజీవి 100వ చిత్రం త్రినేత్రుడుకి ఆయన తమ్ముడు నాగబాబు నిర్మాత.

అది ఒక రిమేక్ చిత్రం.బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ఇప్పుడు చిరంజీవి 150వ చిత్రానికి ఆయన కొడుకు రామ్ చరణ్ నిర్మాత.ఇది కూడా రీమేక్ చిత్రమే కావడం యాదృచ్ఛికం.

ఇలా ల్యాండ్ మార్క్ సినిమాని రిమేక్ చేయడం, అది తన కుటుంబసభ్యులు ప్రొడ్యూస్ చేయడం మన మెగాస్టార్ కి అచ్చిరాలేదు.

డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ గబ్బర్ సింగ్ లో ఐటమ్ సాంగ్ చేసిన లక్ష్మీ రాయ్ దీంట్లో కూడా ఐటమ్ సాంగ్ చేస్తోంది.

ఇలా ఈ సినిమాకి అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube