ఇప్పుడు స్టార్ లుగా ఉన్న వీరు ఒకప్పుడు రూమ్మేట్స్.! ఎవరెవరో ఓ లుక్ వేయండి..!

సినిమాల్లోకి వచ్చాక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్టామినా ఏంటో అందరికీ తెలుసు.కానీ రాకముందు ఎలా ఉండేవాడో నటుడు సునీల్‌ మాత్రమే చెప్పగలడు.

 Tollywood Stars Who Were Roommates During Their Struggling Days-TeluguStop.com

మెగాస్టార్‌గా మారకముందు చిరంజీవి పడ్డ ఇబ్బందులేంటో సుధాకర్‌కి మాత్రమే బ తెలుసు.ఎందుకంటే వీళ్లంతా ఒకప్పుడు రూమ్‌మేట్స్‌.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్న ఇంకొందరూ అలా ఒకప్పుడు ఒకే గదిలో ఉంటూ అవకాశాల కోసం కలిసి కష్టపడినవారే…

1.దర్శకుడు శ్రీనువైట్ల, నిర్మాత అనిల్‌ సుంకర చెన్నైలో ఒకప్పుడు ఒకే గదిలో అద్దెకుండేవారు.

శ్రీను వైట్ల చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేసే రోజుల్లో అనిల్‌ సుంకర సాఫ్ట్‌వేర్‌ కోర్సు చేసేవాడు.ఆ తరవాత అనిల్‌ అమెరికా వెళ్లి వ్యాపారవేత్తగా మారితే, శ్రీను పరిశ్రమకి వచ్చి దర్శకుడిగా స్థిరపడ్డాడు.

తర్వాత ఇండియావచ్చి భాగస్వామిగా ఉన్న నిర్మాణ సంస్థ ‘14రీల్స్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌’ ఏర్పాటు చేశాడు అనిల్, శ్రీను వైట్ల,అనిల్ కలయికలో ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’ లాంటి విజయవంతమైన సినిమాలొచ్చాయి.

2.రవితేజ, వైవీఎస్‌ చౌదరి, గుణశేఖర్‌… పరిశ్రమలో ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తులు.కానీ వాళ్లు అవకాశాల కోసం ప్రయత్నిస్తోన్న రోజుల్లో చెన్నైలో ఒకే గదిలో ఉండేవాళ్లన్న సంగతి చాలామందికి తెలీదు.

ముగ్గరు పరిశ్రమలో స్థిరపడితే కలిసి ఓ సినిమా చేయాలని చాలా ఏళ్ల క్రితమే అనుకున్నారట.వైవీఎస్‌ నిర్మాతగా, గుణశేఖర్‌ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘నిప్పు’ సినిమా అలా వచ్చిందే.

3.హీరోయిన్లు రాశీఖన్నా, వాణీ కపూర్‌ కూడా ఒకప్పుడు గదిని పంచుకున్నవారే.తెలుగులో హీరోయిన్‌గా స్థిరపడ్డ రాశీ, బాలీవుడ్‌లో దూసుకెళ్తొన్న వాణీ కపూర్‌ గతంలో ముంబైలో ఒకే గదిలో ఉండేవారు.ఇద్దరూ కలిసే మోడలింగ్‌ అవకాశాలూ, అక్కడి నుంచి సినిమాల కోసం ప్రయత్నాలు చేసేవారు.

4.పూరిజగన్నాధ్ ,రఘు కుంచె వీరిద్దరూ కూడా ఒకప్పుడు రూమ్మేట్సే.తర్వాత పూరి స్టార్ దర్శకుడిగా ఎదిగారు.రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా,సింగర్ గా తన సత్తా చాటుకున్నారు.

5.వైవిధ్యమైన డైరెక్టర్ కృష్ణవంశీ ,కమెడియన్,రైటర్ ఉత్తేజ్ ఒకప్పుడు ఒకే గదిలో ఉన్నవారే.వీరిద్దరూ రాంగోపాల్ వర్మ శిష్యులు కూడా.

6.మ్యూజిక్ మేష్ట్రో ఇలయరాజా.డైరెక్టర్ భారతిరాజా కూడా ఒకప్పుడు రూమ్మేట్సే.

7.దర్శకులు సుధీర్,చందుమొండేటి.హీరో నికిల్ ఒకప్పుడు రూమ్మేట్సే.కేశవ,స్వామిరారా సుధీర్ ,నికిల్ కాంభినేషన్లో వస్తే… చందు మొండేటి ,నికిల్ కి కార్తికేయ అనే హిట్ ఇచ్చాడు.

8.సుధాకర్ రెడ్డి,వీరు పోట్లా,గోపీ మోహన్ వీరు ముగ్గురు కూడా ఒకప్పుడు ఒక గదిలో ఉ:డి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన వారే.

9.అలనాటి నటులు ఎన్టీయార్,టివి రాజు గారు ఒకప్పడు ఒక గదిలో ఉన్నవారే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube