Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

టాలివుడ్ లో విగ్ వాడుతున్న హీరోలు వీరేనంట-Tollywood Actors Who Are Hiding Baldness With A Wig

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఇండస్ట్రీ. సినిమా తారలి తెర మీద మేకప్ పూసిన తరువాత ఎలా ఉంటారో, తెర బయట కూడా వారిని అలానే చూడాలనుకుంటారు జనాలు. అందుకోసమే బయట కూడా మేకప్ వేస్తారు హీరోయిన్లు, అందుకే లేని వెంట్రుకలతో పాట్లు పడుతూ విగ్ పెట్టుకుంటారు హీరోలు. అలా బయట విగ్ వేసుకోని తిరగడం ఇష్టం లేక, తన ఇమేజ్ ఎప్పటికి అందాల నటుడిగానే ఉండిపోవాలని శోభన్ బాబు మంచి వయసులో ఉండగానే సినిమాలు మానేసి, ఆ తరువాత సినిమా ప్రపంచానికి చాలా దూరంగా బ్రతికారు. అందుకే అతడు సినిమాలో మహేష్ బాబు తాతగా నటించమని అడిగినా, సున్నితంగా తిరస్కరించారు. రజినీకాంత్ మరోరకం. సినిమాల్లోనే తప్ప బయట విగ్ వాడరు. కాని అందరు హీరోల వీరిలానే అలోచించాలని రూల్ లేదుగా. విగ్ వేసుకోని బయట తిరిగే హీరోలున్నారు తెలుగులో. ఆ లిస్టుని ఓ జాతీయ దినపత్రిక ప్రచూరించింది. వారేవరో చూడండి.

మెగాస్టార్ చిరంజీవి కూడా విగ్ వాడుతున్నారట. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన హేయిర్ స్టయిల్ కి, ఇప్పుడు సినిమాల్లో, టీవిలో కనిపిస్తున్న హేయిర్ స్టయిల్ కి చాలా తేడా కూడా ఉంది కదా. అదంతా విగ్ మహిమే అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విగ్ వాడుతున్న సంగతి అల్రెడి తెలుగుస్టాప్ తెలియజేసింది. ఇప్పుడు ఈ జాతీయ దినపత్రిక కూడా అదే విషయాన్ని చెబుతోంది. పవన్ విగ్ వాడటం ఈమధ్యే ప్రారంభించారట.

ఇక బాలకృష్ణ ఎప్పటినుంచో విగ్ వాడుతున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఎందుకంటే విగ్ లేకుండా కూడా ఆయన చాలాసార్లు బయట దర్శనమిచ్చారు. నటికిరిటి రాజేంద్రప్రసాద్ కూడా విగ్ వాడుతున్నారు. సినిమాల్లో, బయట, ఎక్కడున్నా విగ్ కంపల్సరి. నాగార్జున విగ్ వాడకపోయినా, ఏదో హేయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారట. ఇది చాలాతక్కువ మందికి తెలిసిన విషయం.

Continue Reading
More Posts
To Top