సంక్రాంతి పోటీ అప్పుడే ఫిక్స్‌

ప్రతి సంవత్సరం సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద స్టార్‌ హీరోల సందడి కొనసాగుతూనే ఉంటుంది.వందల కోట్ల బిజినెస్‌ సంక్రాంతి సందర్బంగా టాలీవుడ్‌లో జరుగుతోంది.

 Tollywood 2017 Sankranti Race Fixed-TeluguStop.com

ఇక ఇప్పటికే వచ్చే సంక్రాంతికి కూడా సినిమాలు సిద్దం అవుతున్నాయి.బాలకృష్ణ వందవ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇంకా ప్రారంభం కాని ఆ సినిమాను వచ్చే నెలలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశాలున్నాయి.క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న బాలయ్య వందవ సినిమా అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఇక సంక్రాంతి రేసులో ఉండటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.ఈ చిత్రంతో పాటు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా తన సినిమాతో సంక్రాంతి బరిలో దిగే అవకాశాలున్నాయి

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ చిత్రం ‘తని ఒరువన్‌’ రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.ఇక ఆ వెంటనే చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చరణ్‌, సుకుమార్‌ల సినిమా జూన్‌లో పట్టాలెక్కబోతుంది.సుకుమార్‌ సినిమా అంటే కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి.

అయినా కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ముందు నుండే ప్లాన్‌ చేస్తున్నారు.బాలకృష్ణ మరియు రామ్‌ చరణ్‌లతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

మరి వచ్చే సంవత్సరంలో సంక్రాంతికి విజయలక్ష్మి ఎవరిని వరించేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube