ఇప్ప‌టికి 114 సార్లు కేసీఆర్ త‌ల న‌రుక్కోవాలి

కేసీఆర్‌ మాట తప్పితే తలనరుక్కుంటానని మాటమీద నిలబడే వ్యక్తినని ప‌దే ప‌దే చెప్పినా….ఇప్పటివరకు ఆయన 114 సార్లు మాట తప్పారని ఎన్ని సార్లు త‌ల న‌రుక్కున్న‌ర‌ని తెలంగాణ‌ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం విమ‌ర్శించారు.

 Tjac Chairman Fair On Kcr-TeluguStop.com

కరీంనగర్‌లోన నిర్వహించిన ముస్లిం గర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్ధాయిలో విరుచుకు ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , బడ్జెట్‌లో వాటో కోసం మైనార్టీలు ఐక్యంగా ఉద్యమించి, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు.

మైనార్టీల స్థితిగతులపై గతంలో వేసిన రంగనాథ్‌ మిశ్రా, సచార్‌ కమిటీలు ఆర్థికంగా, విద్యా, ఉపాధిలో వెనుకబడిన మైనార్టీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చని, మైనార్టీల స్థితిగతులపై గతంలో వేసిన రంగనాథ్‌ మిశ్రా, సచార్‌ కమిటీలు మండల కమిషన్‌ లోతుగా అధ్యయనం చేసి, ఆర్థికంగా, విద్యా, ఉపాధిలో వెనుకబడిన మైనార్టీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చని సూచించినా, ప్ర‌భుత్వం ఆమేర‌కు నేటికీ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని విమ‌ర్శించారాయ‌న‌.దీంతో విద్య, ఉపాధి విష‌యాల‌లో ముస్లింలకు ద‌క్కాల్సిన భాగం ద‌క్క‌కుండా పోతోంద‌ని ఈ విష‌య‌మై ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌ని అన్నారాయ‌న‌.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌కు త‌ల‌లో నాలుక‌లా వ్య‌వ‌హ‌రించిన కోదండ‌రాం గ‌త కొంత కాలంగా తెరాస‌పైనా, కేసీఆర్‌పై నేరుగా విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తుండ‌టం గ‌మ‌నార్హం.త‌న రిటైర్మెంట్ త‌రువాత అక్కున చేర్చుకుని శాస‌న మండ‌లిలో త‌న‌కు స్ధానం క‌లిపించ‌నందునే కోదండ‌రాం కేసీఆర్‌ని బ‌ద‌నాం చేస్తున్నార‌న్న‌ది తెరాస వ‌ర్గాల వాద‌న‌.

చూద్దాం … భ‌విష్య ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయో….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube