మట్టి మరకలు పోవాలంటే....సులభమైన చిట్కాలు

వర్షా కాలం వచ్చేసింది.బయటకు వెళ్ళామంటే బట్టల మీద మట్టి మరకలు పడవలసిందే.

 Tips For Removing Mud Stains On Clothes-TeluguStop.com

పిల్లల సంగతి అయితే మరీ చెప్పనవసరం లేదు.ముఖ్యంగా పిల్లలు వేసుకొనే యూనిఫారం మీద మట్టి మరకలు అయితే అవి ఒక పట్టాన వదలవు.

ఆ మరకలను సులభంగా వదిలించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.ఇప్పుడు వాటిపై ఒక లుక్ వేద్దాం.

మట్టి మరకలను వదిలించటంలో బంగాళాదుంప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.మరక ఉన్న ప్రదేశంలో బంగాళాదుంప ముక్కతో రుద్ది చల్లని నీటిలో అరగంట సేపు నానబెట్టి ఉతికితే మరక మటుమాయం అవుతుంది.

బట్టలు నానబెట్టే నీటిలో ఒక కప్పు వెనిగర్ వేసి అరగంట అయ్యాక ఉతికితే మరకలు సులభంగా పోతాయి.అలాగే షేవింగ్ క్రీం కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరక కాస్త తడిగా ఉన్న సమయంలో కొంచెం మొక్కజొన్న పిండి వేసి బ్రష్ తో రబ్ చేసి ఉతికితే మారక మాయం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube