మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట వినబడే రెండు పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.వీరిద్దరి మధ్య పోటి ఎందుకు అంటే వీరి సినిమాలు చేసే బిజినెస్ అలా ఉంటుంది కాబట్టి.
సినిమా ఆడటం, ఆడకపోవడం వేరు విషయం.ఎందుకంటే అది సినిమా తీసిన విధానాన్ని బట్టి ఉంటుంది.
కాని సినిమా చేసే బిజినెస్ హీరో స్టామినాని బట్టి ఉంటుంది.ఆ లాజిక్ ప్రకారం వీరిద్దరు ఈతరం నటుల్లో వేరే లెవల్ లో ఉన్నారు.
కాని ఇద్దరిలో ఎవరు నెం1 ?
ఈ ప్రశ్న గత ఐదారేళ్లుగా బాగా చర్చించబడుతోంది.కాని ఫలితం మాత్రం తేలలేదు.
ఎందుకంటే ఇద్దరు సరైనా ఫామ్ లో లేరు.ఓ హిట్ పడితే, ఆ వెంటనే ఓ ఫ్లాప్ పడుతుంది.పోనీ ఇద్దరు కలిసి పోటికి వచ్చారా, విజేతని నెం.1 అనేద్డం అంటే పోకిరి – బంగారం తరువాత ఇద్దరు ఒక్కసారి కూడా బాక్సాఫీస్ పోటికి రాలేదు.దశాబ్దకాలం క్రితం విజయం మహేష్ దే అయినా, ఇప్పుడున్న పవన్ ఇమేజ్ వేరు.నిజం చెప్పాలంటే గతకొంతకాలంగా ఇమేజ్ విషయంలో పవన్ మహేష్ ని వెనక్కి నేట్టేసాడు.
కాని మహేష్ పునర్వైభవం సాధించాలంటే ఎంతో సమయం పట్టదు, ఒకటి రెండు సినిమాలు ఆడితే చాలు.
సరే ఇప్పడు ఇదంతా ఎందుకు కాని, ఎవరి స్టామినా ఏంతో అతిత్వరలో తేలిపోతుంది.
ఎందుకంటే 2018 సంక్రాంతి సీజన్ అతిపెద్ద బాక్సాఫీస్ పోటికి వేదిక కాబోతోంది.మహేష్ బాబు “భరత్ అనే నేను”, పవన్ కళ్యాణ్ 25వ సినిమా, రెండూ సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.
మహేష్ – కొరటాల సినిమా జనవరి 11, 2018న విడుదల అవుతుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలకి సమాచారం వెళ్ళింది.ఇక పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి వస్తుందని ఎప్పుడో ప్రకటించారు.
కాబట్టి ఈసారి ఈ ఇద్దరు పోటిపడటం దాదాపుగా ఖాయం.రెండూ యాక్షన్ సినిమాలే కాబట్టి, రెండువైపులా “బ్రాండ్” ఇమేజ్ ఉన్న దర్శకులే కాబట్టి, ఈసారి ఇద్దరు తీసుకొచ్చే బిజినెస్, ఓపెనింగ్స్ ని పోల్చి చూద్దాం .నెం1 ఎవరో తేలిపోతుంది.