టీఆర్ఎస్‌లోకి ముగ్గురు మాజీ మంత్రులు

తెలంగాణ‌లో కొద్ది నెల‌ల వ‌ర‌కు జోరుగా సాగిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇప్పుడు కాస్త బ్రేక్ ప‌డింది.ఇప్ప‌టికే తెలంగాణ‌లో అన్ని విప‌క్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు.

 Three T-congress Ex Ministers To Join Trs..?-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే వారిలో కొంద‌రు మంత్రి ప‌ద‌వులు సైతం పొందారు.ఇక ఇప్పుడు అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ మ‌రింత వీక్ చేసేందుకు కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పెద్ద ప్లాన్ వేసిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.

కాంగ్రెస్ పాల‌న‌లో మాజీ మంత్రులుగా ప‌ని చేసి, ప్ర‌స్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న ముగ్గురిపై టీఆర్ఎస్ వ‌ల వేసిన‌ట్టు తెలుస్తోంది.ఈ ముగ్గురు మాజీ మంత్రులు కూడా పార్టీ మారిపోతే 2019లో టీఆర్ఎస్‌కు దాదాపు ఎదురులేద‌నే అనుకోవాలి.

ఇప్ప‌టికే కీల‌క నాయ‌కుల జంపింగ్‌లు చేసేయ‌డం, అసెంబ్లీలోను, బ‌య‌ట ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే నాయ‌కులు లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంగా కూడా స‌రైన నోల్ ప్లే చేయ‌లేక‌పోతోంది.తెలంగాణ‌లో రాజ‌కీయ వ‌ర్గాలు, మేథావుల అంచ‌నా ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్‌దే గెలుపు అన్న అభిప్రాయం చాలా మంది వ్య‌క్తం చేస్తున్నారు.

కేసీఆర్ మాట‌ల్లో చెప్పాలంటే మ‌రింత బొంద పెట్టే ప్లాన్‌లో మ‌రో ముగ్గురు మాజీ మంత్రుల‌ను సైతం కారెక్కించేసుకుంటున్నారు.సీనియ‌ర్లు అయిన కె.జానారెడ్డి – డీకే.అరుణ – షబ్బీర్ ఆలీల‌కు టీఆర్ఎస్ వ‌ల‌వేసిన‌ట్టు తెలుస్తోంది.

వీరిలో జానారెడ్డి వ్య‌వ‌హారాన్ని కేసీఆరే స్వ‌యంగా డీల్ చేస్తుంటే, ష‌బ్బీర్ ఆలీతో హ‌రీష్‌రావు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌.

ఇక డీకే అరుణ‌ను పార్టీలో చేర్చుకునే క్ర‌మంలో ఆమెతో విబేధాలున్న టీఆర్ఎస్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు న‌చ్చ‌చెప్పే బాధ్య‌త‌ల‌ను కొంద‌రు సీనియ‌ర్ మంత్రులు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ముగ్గురు మంత్రులు కూడా టీఆర్ఎస్‌లో చేరిపోతే 2019లో టీఆర్ఎస్ కారు జోరుకు బ్రేకులు ఉండ‌వు.ఇక ఇదే బాట‌లో మరికొంద‌రు ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని స‌మాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube