పూరి డ్రగ్స్ కేసు విచారణలో అసలేం జరిగింది అంటే

టాలివుడ్ డ్రాగ్ మాఫియా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తన పనులు నిన్నే మొదలుపెట్టింది.అందరికన్నా ముందు, నిందితుల్లో ఎక్కువ ఫోకస్ ఉన్న పూరి జగన్నాథ్ నే ఇంటరాగేట్ చేసారు.

 This Is What Happened In Puri Jagannath’s Drug Case Investigation-TeluguStop.com

కొన్ని గంటల పాటు జరిగింది ఈ విచారణ.కెల్విన్ గురించి, కేల్వన్ తో పూరి జగన్నాథ్ కి సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం మీద సిట్ అధికారులు ప్రశ్నలు వేసారు.

పూరి వారికి ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.అలాగే టెస్టుల కోసం తన బ్లడ్ సంపుల్స్ ని అందజేశారు.

ఈ బ్లడ్ సాంపిల్ ని టెస్టు చేసిన తరువాత పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనే విషయాన్ని తెల్చుతారు.ఈరోజు నంబర్ కెమెరా మెన్ శ్యాం కె.నాయుడిది.బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న ముమైత్ ఖాన్ ని సోమావారం విచారించనున్నట్లు సమాచారం.

విచారణ ముగిసిన తరువాత పూరి జగన్నాథ్ తన అభిమానుల కోసం ఓ విడియోని విడుదల చేసారు.పూరి మాట్లాడుతూ ” నా మీద వచ్చిన ఆరోపణలపై సిట్ అధికారులు చాలా ప్రశ్నలు అడిగారు.

అన్నిటికి సమాధానం చెప్పాను.కెల్విన్ ముఠాతో నాకు ఎలాంటి సంబంధం లేదని, అతడ్ని ఎప్పుడు కలవలేదని చెప్పాను.

అధికారులు మళ్ళీ పిలిస్తే వారితో సహకరించేందుకు సిద్ధం.నేను బాధ్యత గల వ్యక్తిని.

న్యాయవ్యతిరేక పనులు ఎప్పటికి చేయను.నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్ గా చాలా సినిమాలు చేశాను.

జర్నలిస్టుల మీద ప్రమతో ఇజం అనే సినిమా తీసాను.మీడియాలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు.

అందరం కలుస్తాం.కలిసి కాఫీ తాగుతాం.

ఫ్రెండ్లీగా ఉండే వీళ్ళు, టైమ్ రాగానే నాపై ప్రోగ్రామ్స్ చేసారు.తెలిసి తెలియని విషయాలతో ప్రోగ్రాంస్ చేసారు.

నిజం చెప్పాలంటే జీవితాల్ని నాశనం చేసారు.నా భార్య, పిల్లలు, చుట్టాలు నాలుగు రోజులుగా ఏడుస్తున్నారు.

నా ఒక్కడే జీవితమే కాదు.మిగితావరి పరిస్థితి కూడా ఉంది.

రేపు ఆ జర్నలిస్టులు మళ్ళీ నన్ను కలిసే మాట్లాడేవారే.ఎవరు తప్పు చేసారు అనేది సిట్ అధికారులు డిసైడ్ చేస్తారు” అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

పూరి విచారణకు బాగా సహకరించారని, బ్లడ్ సాంపిల్స్ తో పాటు, అడిగిన సమాచారాన్ని ఇచ్చారాని.టెస్టుల తరువాత ఫలితాలను ప్రకటిస్తామని సిట్ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube