మద్యం రోజుకి ఎంతవరకు తీసుకుంటే మంచిది?

మద్యం సేవించే అలవాటు ఉన్నవారిని కదిలించాం అనుకోండి, “మద్యం తక్కువ తాగితే గుండెకి మంచిదే”, ” మనం వాడే ప్రతి మందుమాత్రలో ఎంతో కొంత ఆల్కహాల్‌ ఉంటుంది తెలుసా”, “రోజుకో డ్రింక్ ఆరోగ్యానికి మంచిది బాబు” అనే సమాధానాలు వినిపిస్తుంటాయి.ఈ రోజుకి ఒక డ్రింక్ అనే పాలసి ఎక్కువగా మహానగరాల్లో ఉండే హై క్లాస్ ప్రజలు పాటిస్తుంటారు.

 This Is The Ideal Equation For Alcohol Intake-TeluguStop.com

రోజుకో డ్రింక్ మంచిదే కాని, ఆ డ్రింక్ లో ఆల్కహాల్ ఎంత ఉండాలో తెలియక, తెలసినా పాటించక, లేని అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డోనాల్డ్ నోవే ఈ విషయం మీద మాట్లాడుతూ ” మహిళలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింక్స్ పుచ్చుకోవచ్చు ప్రతిరోజు.

కాని ఒక డ్రింక్ లో ఎంత ఆల్కహాల్ వాడాలి అనేదానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.బీర్ అయితే 12 ఔన్సులు, వైన్ అయితే 5 ఔన్సులు, విస్కీ అయితే 1-2 ఔన్సులు మాత్రమే కలుపుకోవాలి ఒక డ్రింక్‌ లో.ఇలా పద్ధతిగా తాగితేనే ఆరోగ్యం ” అంటూ పనికొచ్చే విషయాన్ని తెలియజేశారు.

మందుబాబులు ఎలాగో ఇలాంటి విషయాల్ని పట్టించుకోరు కాని అరోగ్యం మీద భక్తి, శ్రద్ధలు ఉన్నవారైనా పట్టించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube