ఇదే మహేష్ కి , పవన్ కి ఉన్న తేడా అంటున్నారు

పెద్ద హీరోలతో సినిమా అన్నాక, అయితే అతివృష్టి ఉంటుంది లేదంటే అనావృష్టి ఉంటుంది.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్రహీరోల మీద అయితే బిజినెస్ బరువు మరీ ఎక్కువ ఉంటుంది.

 This Is The Difference Between Mahesh Babu And Pawan Kalyan-TeluguStop.com

వీరి సినిమాలకి జరిగే బిజినెస్ లెవల్ వేరు.కాబట్టి సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే తప్ప పంపిణిదారులు నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోలేరు.

అదే సినిమా బాగాలేకపోతే నరకమే.ఇద్దరి చివరి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

ఇద్దరి సినిమాలకి 30 కోట్లకి పైగా నష్టాలు వచ్చాయి.ఇద్దరు బయ్యర్లకి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు.

మరి మహేష్ మీద లేని కంప్లయింట్స్ పవన్ మీద మాత్రమే’ వస్తున్నాయి ఎందుకు ?

మహేష్ ఫామ్ ఈమధ్య గొప్పగా లేదు.చివరి నాలుగు సినిమాల్లో మూడు డిజాస్టర్స్ చూసాడు.

ఇలాంటి గడ్డు కాలం కెరీర్లో ఎప్పుడు చూడలేదు మహేష్.అయినా, మహేష్ ని తిట్టుకుంటూ ప్రెస్ మీట్ పెట్టలేదు పంపిణిదారులు.

కారణం ? 1-నేనొక్కడినే.ఆగడు, బ్రహ్మోత్సవం … ఈ మూడు చిత్రాల పరాజయానికి బాధ్యత వహించాడు ప్రిన్స్.

నిర్మాతలకి తన రెమ్యునరేషన్ లో కొంతభాగాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేసాడు.పంపిణిదారులకి నష్టపరిహారం అందేలా చూడటమే కాదు, తానూ కూడా ఆ నష్టాల్ని భరించాడు.

వరుస డిజాస్టర్లు పడుతున్న, మహేష్ ఇదే పధ్ధతి కొనసాగించాడు.మరి పవన్ ?

పవన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.చాలాకాలం తరువాత పవన్ సినిమా ఒకటి డిజాస్టర్ గా నిలిచింది.సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్లకి నష్టపరిహారం కింద కాటమరాయుడు రైట్స్ తక్కువ రేట్లకి అందిస్తామని పవన్ కళ్యాణ్, సర్దార్ నిర్మాత చెప్పుకొచ్చారు.

కాని మాటమీద నిలబడపోయేసరికి బయ్యర్లు ప్రెస్ మీట్లు పెట్టారు .అయినా వారిని పట్టించుకోలేదు.ఇప్పుడు ఏకంగా రోడ్డు ఎక్కి నిరాహారదీక్ష చేస్తున్నారు .ఇంత జరుగుతున్నా పవన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.ఈ విషయాలన్నీ పవన్ కి తెలియకుండా ఉండవు కదా.అయినా, అదే అలసత్వం.ఇదే … మహేష్ కి , పవన్ కి మధ్య ఉన్న తేడా అని, ఇందుకే, మహేష్ తో సినిమా తీయడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతారని ఫిలింనగర్ జనాలు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube