రాజమౌళి - అల్లు అరవింద్ మధ్య గొడవలు బయటపడ్డాయి

2009 లో వచ్చిన మగధీర ఓ పెను సంచలనం.అప్పటి ఇండస్ట్రీ హిట్ పోకిరిని చాలా పెద్ద మార్జీన్ తో బద్దలుకొట్టి, అప్పటికి ఇండియాలో షేర్ లెక్కల్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది.

 This Is Reason Behind Disparities Between Rajamouli And Allu Aravind-TeluguStop.com

రామ్ చరణ్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది.కాని ఆ చిత్రం పెద్ద విజయం సాధించాక రాజమౌళికి – అల్లు అరవింద్ కి కొన్ని మనస్పర్థలు వచ్చాయని అప్పట్లోనే అనేవారు.

రాజమౌళికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదని, సినిమా రామ్ చరణ్ భుజాల మీదే ఆడినట్టుగా ప్రచారం చేసారని అప్పట్లో చాలా మాట్లాడుకున్నారు సినీజనాలు.అందులో నిజానిజాలు పక్కనపెడితే, రాజమౌళికి – అల్లు అరవింద్ మధ్య ఏదో జరిగింది అనేది మాత్రం నిజం.

రాజమౌళి మగధీర 100 రోజుల వేడుకకి హాజరవలేదు.దాని వెనుక కారణం ఏమిటో ఇన్నేళ్ళకు తెలిసింది.

ఓ సినిమా పెద్ద హిట్ అయితే చాలు, దాన్ని వంద, రెండువందల రోజులు ఆడించాలని చూస్తారు అభిమానులు.వారి తీసుకొచ్చే ఒత్తిడికి నిర్మాత తలొగ్గి ఆడిస్తే ఓకే, లేదంటే సొంతంగా డబ్బు పెట్టి ఆడిస్తారు.

రికార్డ్స్ అంటే పిచ్చి వాళ్ళకి.ఈ పిచ్చి ఎలాగైనా వదిలించాలి అనుకున్నాడు జక్కన్న.అల్రెడి సింహాద్రి సమయంలో రాజమౌళికి చేదు అనుభవం ఎదురైంది.175 రోజుల రికార్డు కోసం కొన్ని మతలాబులు చేసారట.అప్పుడే నొచ్చుకున్న రాజమౌళి మగధీరకి మనం అలా చేయకూడదని అల్లు అరవింద్ తో అన్నారట.మొదట వందరోజుల లెక్కల్లో అవకతవకలు, బలవంతంగా ఆడించడం వద్దని ఒప్పుకన్న అల్లు అరవింద్, చివరకి చిరంజీవి అభిమానులు ఒత్తిడకి తలొగ్గి, మగధీర 100 రోజుల రికార్డు కోసం కొన్ని అవకతవకలు చేసారట.

దాంతో రాజమౌళి విసుగుతో ఆ ఫంక్షన్ నేను రాను అని చెప్పేసాడట.ఇదండీ రాజమౌళి బయటపెట్టిన అసలు కారణం.

బాహుబలి ఇంత పెద్ద హిట్ అయినా, 50,100,200 రోజుల లెక్కల ఉచ్చులో పడలేదు.రాజమౌళి పడనీయలేదు.

కావాలని ఆడించడం, లేని సెంటర్లు చెప్పడం తన వళ్ళ కాదని, ప్రభాస్ అభిమానులు ఇలాంటివి ఆశించవద్దని ముందే చెప్పాడు జక్కన్న.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube