మీ పిల్లలు సిగరెట్ తాగుతున్నారో లేదో ఇలా కనిపెట్టండి

ప్రపంచంలో పొగత్రాగడం కంటే ప్రమాదకరమైన అలవాటు మరొకటి లేదు అంటారు .ప్రతీరోజు లక్షలమందికి పైగా సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటున్నారట .

 This Is How You Can Find If Your Child Has Started Smoking-TeluguStop.com

ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా , ఈ చెత్త అలవాటు ఎందుకు మొదలుపెడతారో తెలియదు కాని, ఒకటి రెండు కాదు , శారీరకంగా, మానసికంగా ఎన్ని కష్టాలు అనుభవించాలి .సిగరెట్ తాగితే ప్రంపంచంలో ఉన్న జబ్బులన్ని మన శరీరానికి వచ్చి చేరతాయి అన్న సంగతి తెలుసు.అయినా శరీరాన్ని మోసం చేస్తారు .అలాగే తల్లిదండ్రుల కళ్ళుగప్పి పోగాతాగుతూ , వాళ్ళని మోసం చేస్తున్నారు నేటి యువతి యువకులు .నేడు ప్రపంచ నో టొబాకో డే .మీ పిల్లల్ని కాపాపుకోవాల్సిన బాధ్యత మీదే.ఎందుకంటే ఈ అలవాటు టీనేజి లేదా ఇరవై దాటగానే కదా మొదలయ్యేది .

మరి పిల్లలు సిగరెట్ తాగితే ఎలా కనిపెట్టాలి ?

* బాత్రూం ఎక్కువగా వెళుతూఉంటారు .ఏమాత్రం తేడా కొట్టినా , బాత్రుం లో సిగరెట్ వాసన వస్తుందో లేదో గమనించండి
* దగ్గరగా మాట్లాడటం తక్కువ అయిపోతుంది .ఎక్కడ కనిపెట్టేస్తారో అని దూరంగా మాట్లాడుతారు .ప్రవర్తన మారితే ఓ కన్నేసి ఉంచండి
* వక్కపొడి , చూయింగ్ గమ్ అతిగా వాడితే, మీరు అనుమానపడాల్సిందే
* ఒంటరిగా గడపడానికి ప్రయత్నించడం , తిన్నవెంటనే బయటకి వెళ్ళడం , తీ తాగిన వెంటనే ఇంట్లో కూర్చోకపోవడం .ఇలాంటివి ఎక్కువగా చేస్తోంటే కాస్త గమనించండి
* పెదాల రంగు, పళ్ళ రంగు మారిపోయిందంటే సిగరెట్ అలవాటు లేదు అని పిల్లలు చెప్పినా , మీరు నమ్మాల్సిన పని లేదు .

అయితే దొరికేసారు కదా అని తిట్టడం కొట్టడం లాంటివి వద్దు .ఆ అలవాటు వలన జరిగే నష్టాల్ని వివరించి భయపెట్టండి చాలు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube