అంతా ఎన్టీఆర్‌ అనుకున్నట్లే జరుగుతోంది-This Is Definitely NTR Golden Phase 3 months

Nannaku Prematho Ntr NTR With Trivikram Overseas Collections This Is Definitely NTR' Golden Phase Photo,Image,Pics-

ఒక్కోసారి టైమ్ ఎలా నడుస్తుంది అంటే అన్ని మనం అనుకూలంగానే జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ టైమ్ నడుస్తోంది. అన్ని సానుకూలంగానే, తానే ఏదో స్క్రిప్టు రాసుకున్నట్లుగా జరిగిపోతున్నాయి. విషయంలోకి లోతుగా వెళితే, స్టార్ గా ఎదిగిన తరువాత ఎన్టీఆర్ కెరీర్ ని టెంపర్ కి ముందు టెంపర్ తరువాత అని విభజించవచ్చు.

రొటీన్ సినిమా తీసే నటుడు అనే ఇమేజ్ చట్రంలోంచి బయటపడాలని తీసిన టెంపర్ మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాదు, ఎన్టీఆర్‌ పోగొట్టుకున్న కొన్ని సెక్షన్ల ఆడియెన్స్ ని మళ్ళీ తనవైపు నడిపించింది. ఓవర్సీస్ మార్కేట్ పెంచుకోవాలి, క్లాస్ ఆడియెన్స్ కి దగ్గర కావాలని నాన్నకు ప్రేమతో తీస్తే, ఆ ప్లాన్ కూడా సక్సెస్ అయిపోయింది. ఆ సమయానికి బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తరువాత ఓవర్సీస్ లో మూడొవ అతిపెద్ద హిట్ గా నిలిచింది ఆ సినిమా.

ఇమేజ్ చట్రంలోంచి బయటపడ్డాడు ఓకే. ఓవర్సీస్ ఆడియెన్స్ లో నమ్మకం పెరిగింది ఓకే. కాని సౌండ్ గట్టిగా వచ్చే ఓ భారి కలెక్షన్ల సినిమా కావాలి. ఆ ముచ్చట కూడా జనతా గ్యారేజ్ తో తీరిపోయింది. విమర్శకులకి వరుసబెట్టి గట్టిగా సమాధానమిస్తున్నాడు యంగ్ టైగర్. ఇక ఎన్టీఆర్‌ కి కావాల్సింది ఏ సెంటర్లు, మల్టిప్లెక్స్ ఆడియెన్స్, ఓవర్సీస్ రికార్డులు … వీటిని అందించాలంటే త్రివిక్రమ్ సినిమా కావాలి. అదృష్టం ఎలాంటిదో మరి, పవన్ కళ్యాణ్ – త్రికవిక్రమ్ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ వర్గంవారు త్రివిక్రమ్ తో సంప్రదింపులు మరింతగా పెంచారని టాక్. చూద్దాం .. ఈ పని కూడా జరిగి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా కూడా మొదలైపోతే ఒప్పుకోవాల్సిందే నడుస్తున్నది ఎన్టీఆర్‌ టైమ్ అని.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..అంతా ఎన్టీఆర్‌ అనుకున్నట్లే జరుగుతోంది

  This Post provides detail information about అంతా ఎన్టీఆర్‌ అనుకున్నట్లే జరుగుతోంది was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  This is definitely NTR golden phase, NTR, NTR With Trivikram, Janatha Garage, Overseas Collections, Nannaku Prematho

  Tagged with:This is definitely NTR golden phase, NTR, NTR With Trivikram, Janatha Garage, Overseas Collections, Nannaku PremathoJanatha Garage,Nannaku Prematho,ntr,NTR With Trivikram,overseas collections,This is definitely NTR' golden phase,,