సాహోలో ప్రభాస్ కి జోడి ఈవిడే ... ఇది ఫిక్స్

బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు ? దేశం మొత్తం ఇదే ఆసక్తి.బాహుబాలి సిరీస్ తో నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు ప్రభాస్.

 This Bollywood Babe Confirmed In Saaho-TeluguStop.com

రజినీకాంత్ కి కూడా లేని హిందీ మార్కెట్లో ఇప్పుడు ప్రభాస్ కి పట్టు దొరికింది.ఆ వేడి తగ్గకుండా ఉండేందుకే సాహో టీజర్ ఒకటి వదిలి సర్వత్రా ఆసక్తి మొలకెత్తేలా చేసాడు డార్లింగ్.

కాని ఎప్పుడో ఏప్రిల్ లో టీజర్ వస్తే, మళ్ళీ ఆ తరువాత ఆ సినిమా అప్డేట్స్ లేవు.జూన్ లో మొదటి షెడ్యూల్ మొదలైతే ఇన్నీరోజులు అసలు హీరోయిన్ ఎవరో కూడా చెప్పలేదు.

వెయిట్ చేయిస్తే చేయించారు కాని మంచి సెలెక్షన్ చేసారు.

బాలివుడ్ బ్యూటి శ్రద్ధ కపూర్ సాహోలో హీరోయిన్ గా ఫైనల్ అయిపోయినట్టు సమాచారం.

గత రెండు నెలలుగా ఈ అమ్మడితో జరుపుతున్న చర్చలు మొత్తానికి సఫలం చెందాయి.ఈ నెల 19న సాహో యూనిట్ తో కలవనుంది శ్రద్ధ.

ఆరోజు నుంచి హీరోహీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తీయడం ప్రారంభిస్తారు.

శ్రద్ధనే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయం మీకు అర్థమయ్యేలా చెప్పనక్కరలేదు అనుకుంటా.

సాహో తెలుగుతో పాటు తమిళం, హిందీ మరియు మళయాళ భాషల్లో విడుదల కానున్న చిత్రం.అందుకే బాలివుడ్ ఖచ్చితంగా కావాల్సిందే అనుకున్నారు.మొదట దిశా పటాని మరియు పరిణీతి చోప్రా తో సంప్రదింపులు జరిపినా, వేరు వేరు కారణాల వలన ఇద్దరినీ ప్రాజెక్టు నుంచి తప్పించాల్సి వచ్చింది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, రెండు వేరు వేరు కాలాల్లో సినిమా ఉంటుందని ఓ రూమర్ ఉంది.

ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.సాహో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube