Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సాహోలో ప్రభాస్ కి జోడి ఈవిడే ... ఇది ఫిక్స్ -This Bollywood Babe Confirmed In Saaho

బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు ? దేశం మొత్తం ఇదే ఆసక్తి. బాహుబాలి సిరీస్ తో నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. రజినీకాంత్ కి కూడా లేని హిందీ మార్కెట్లో ఇప్పుడు ప్రభాస్ కి పట్టు దొరికింది. ఆ వేడి తగ్గకుండా ఉండేందుకే సాహో టీజర్ ఒకటి వదిలి సర్వత్రా ఆసక్తి మొలకెత్తేలా చేసాడు డార్లింగ్. కాని ఎప్పుడో ఏప్రిల్ లో టీజర్ వస్తే, మళ్ళీ ఆ తరువాత ఆ సినిమా అప్డేట్స్ లేవు. జూన్ లో మొదటి షెడ్యూల్ మొదలైతే ఇన్నీరోజులు అసలు హీరోయిన్ ఎవరో కూడా చెప్పలేదు. వెయిట్ చేయిస్తే చేయించారు కాని మంచి సెలెక్షన్ చేసారు.

బాలివుడ్ బ్యూటి శ్రద్ధ కపూర్ సాహోలో హీరోయిన్ గా ఫైనల్ అయిపోయినట్టు సమాచారం. గత రెండు నెలలుగా ఈ అమ్మడితో జరుపుతున్న చర్చలు మొత్తానికి సఫలం చెందాయి. ఈ నెల 19న సాహో యూనిట్ తో కలవనుంది శ్రద్ధ. ఆరోజు నుంచి హీరోహీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తీయడం ప్రారంభిస్తారు.

Continue Reading

Trending…

To Top