తిన్న వెంటనే ఈ పనులు చేయొద్దు

తిన్న వెంటనే వాకింగ్ చేయడం కొందరి అలవాటు.పడుకోవడం మరికొందరి అలవాటు, టీ తాగడం ఇంకొందరి అలవాటు.

 Things We Shouldn’t Do After Eating-TeluguStop.com

ఎవరికి వారే డాక్టర్లలా ప్రవర్తిస్తూ ఉంటారు.కాని తిన్నవెంటనే కొన్ని పనులు అస్సలు చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు.అవేంటో చూద్దాం.

వాకింగ్ :

చాలా ఇళ్ళలో రోజూ జరిగే తంతే ఇది.మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు తిన్న వెంటనే వాకింగ్ చేస్తారు.అలా ఎందుకంటే తిన్నది బాగా అరుగుతుంది అంటారు.

కాని తిన్న వెంటనే వాకింగ్ చేయకూడదు అంట.తిన్న తరువాత కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాకింగ్ చేయవచ్చు కాని, తిన్నవెంటనే వాకింగ్ చేస్తే జీర్ణక్రియలో సమస్యలు వస్తాయట.

టీ తాగడం :

తిన్న తరువాత టీ మాత్రం అస్సలు తాగకూడదు.టీలో ఉండే టాన్నిన్స్, పోలిఫెనల్స్, మన శరీరంలోకి తిండి ద్వారా చేరిన ఐరన్ ని వంటబట్టకుండా చేస్తాయి.భోజనం చేసాక ఓ గంటపాటు టీ తాగకపొవడమే మంచిది.

పడుకోవడం :

తిన్నవెంటనే పడుకోవడం వలన నష్టాలే తప్ప, లాభాలు లేవు, కడుపులో మంట, అజీర్ణము .ఇవన్ని ఈ అలవాటు వలన వచ్చేవే.

స్నానం చేయడం :

మన స్నానం చేస్తున్నప్పుడు, మన బాడి టెంపరేచర్ ని కంట్రోల్ లో పెట్టడానికి, రక్తాన్ని చర్మం కోసం ఎక్కువ సరఫరా చేస్తుంది గుండే.దీనివల్లే మనలో వేడి బయటకి వచ్చి, చల్లగా అనిపిస్తుంది.తిన్న వెంటనే స్నానం చేయడం వలన అటు జీర్ణక్రియ కోసం, ఇటు చర్మం కోసం ఒకేసారి రక్తం సరఫరా జరుగుతుంది.

అజీర్ణ సమస్యలు పెరిగే అవకాశాలు పెరుగుతాయి దీనివల్ల.అందుకే కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి స్నానం చేయండి.

పండ్లు తినటం :

తిన్నవెంటనే పండ్లు తినకూడదు.అప్పటికే మీ భోజనం జీర్ణం అవుతూ ఉంటుంది.

దాంతో మీరు తిన్న ఫలం అంత త్వరగా జీర్ణం కాదు.భోజనం చేసాక కనీసం ఓ గంట ఆగి ఏదైనా ఫలం తినొచ్చు.

అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటున్నారు.మరి తిన్నాక ఏం చేయాలి అనే కదా మీ డౌటు! తిన్నాక కాసేపటికి నీళ్ళు తాగండి.

మీ కుటుంబసభ్యులతో అరగంట కబుర్లు పెట్టండి.శారీరకంగా, మానసికంగా ఎలాంటి కష్టం వద్దు తిన్న వెంటనే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube