Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

శృంగారం లో స్త్రీ పైన ఉండాలనుకుంటే .. ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి -Things To Remember Before She Tries Girl On Top Sex

సెక్స్ ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? ఎప్పుడు మగవారు పైన ఉండి, ఆడవారు కింద ఉండి, అదే రొటీన్ మిషినరి సెక్స్ పొజీషన్లో సెక్స్ చేస్తే కొన్నిరోజుల్లో సెక్స బోర్ కొట్టదా? అందుకోసమే, మీ సెక్స్ లైఫ్ ని రసవత్తరంగా మార్చడానికే రకరకాల సెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. ఆ సెక్స్ పోషిషన్లలో స్త్రీలు బాగా ఇష్టపడే సెక్స్ పొజిషన్లు కౌ గర్ల్, రివర్స్‌ కౌ గర్ల్. ఈ సెక్స్ పొజిషన్లని మహిళలు ఎందుకు ఇష్టపడతారు అంటే, సెక్స్ వారి కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి. అంటే ఈ సెక్స్ పొజిషన్స్ లో స్త్రీ పైన ఉంటే పురుషుడు కింద ఉంటాడు. స్త్రీలకి ఈ పొజిషన్లో సెక్స్ చేయడం ఓ కొత్త అనుభూతి లాంటిది. కాని ఇలా సెక్స్‌ చేసేముందు స్త్రీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అవేంటో చూడండి.

* మొదటగా, ఈ సెక్స్‌ పొజీషన్లో సెక్స్ చేయాలంటే స్త్రీకి కావాల్సింది బలం. ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయి. కష్టం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ శ్రమపడాలి కాబట్టి శరీరం అంత శక్తిని కలిగి ఉన్నప్పుడే ఈ పొజీషన్ ప్రయత్నించాలి.

* మొకాళ్ళలో నొప్పులు ఉండకూడదు. కీళ్ళ నొప్పులు ఉన్న మహిళలు ఈ సెక్స్ పొజీషన్ ప్రయత్నించకపోవటమే మంచిది. మొకాళ్ళు బలంగా ఉంటేనే ప్రయత్నించండి.

* ఈ పొజిషన్ లో సెక్స్ చేసే మహిళ అధిక బరువు ఉండకూడదు. అధిక బరువు ఉన్న స్త్రీలకి ఈ సెక్స్ పొజిషన్ కష్టమని చూస్తే మీకే అర్థమయిపోతుంది. బరువు, బలం వేరు .. బలం ఉండాలి కాని బరువు ఉండకూడదు.

* శరీరం మీద బాగా బ్యాలెన్స్ ఉన్న స్త్రీలే దీన్న ట్రై చేయాలి. కుదిరితే సెక్స్ ముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచిది. పొరపాటున బ్యాలెన్స్ తప్పితే బరువంతా పురుషాంగం మీద పడుతుంది. దాంతో పురుషాంగం ఫ్రాక్చర్ అవుతుంది.

* బ్యాలెన్స్ తప్పడం అంటే పూర్తిగా అదుపు తప్పి పురుషుడి మీద పడిపోవడమే కాదు, ఈ పొజిషన్ లో పెనట్రేషన్ కొంచెం యాంగిల్ మారినా అది పురుషాంగానికి ప్రమాదమే. ఆ నొప్పిని మాటల్లో వర్ణించడం కష్టం.

కాబట్టి ఈ సెక్స్ పొజిషన్ ప్రయత్నించేముందు భాగస్వాములిద్దరు చర్చించుకోవాలి. ఇద్దరు ముందే ఈ పొజిషన్ లో బేసిక్స్ నేర్చుకున్నట్లుగా నెమ్మదిగా లైట్ ప్రాక్టీస్ చేయాలి. అంతా ఒకే అనుకున్నాక సెక్స్ మొదలుపెట్టాలి.

Continue Reading
More Posts
To Top
Raashi Khanna New Pics