అమ్మాయి విచిత్రంగా ప్రవర్తిస్తే ఇవన్ని గమనించాలి!

“ఆడువారి మాటలకి అర్థాలే వేరులే” అన్నాడో సినీకవి.అందులో సందేహం ఏమి లేదు.

 Things To Observe When A Girls Behaves Odd-TeluguStop.com

ఆడవారు బేసిక్ గానే అర్థం కారు.ఈరోజు ఉన్నంత చనువుగా రేపు ఉంటారన్న గ్యారంటీ ఉండదు.

ఎలాంటి జోక్ కి నవ్వుతారో, ఎలాంటి జోక్ ని సీరియస్‌గా తీసుకుంటారో కూడా అర్థం కాదు.ఓ క్షణం సరదాగా నవ్వి, మరోక్షణం ఎవడ్రా వీడు అన్నట్లు ముఖం పెట్టేయగలరు.

ఆడవారు ఓ పట్టాన అర్థం కారు.తప్పు లేకున్నా పెద్దగా క్లాస్ పీకేస్తుంటారు.

ఆలాంటప్పుడు అబ్బాయిలు ఏం చేయాలి?

* ఒకటికి పదిసార్లు కొపంగా మాట్లాడితే ఎందుకు మాట్లాడింది? తప్పు ఎవరిది అనే బాగా అలోచించాలి.

* ఆడవారిని అర్థం చేసుకోవాలంటే ఓపిక అత్యవసరమైన వస్తువు.

కాబట్టి ఓ కంక్లూజన్ కి ముందే రాకుండా ఓపిగ్గా వారిని గమనించాలి.

* బేసిగ్ గా అమ్మాయిలు రెండురకాలు .డ్రామాటిక్ గా ఉండేవారు ఒకవైపు, ప్రాక్టికల్ గా ఉండేవారు మరోవైపు.డ్రామేటిక్ గా ఉండేవారు ఓ మాట అంటే దాన్ని ఫైనల్ చేసుకోకూడదు.

ఇలాంటివారు తమ అలోచనల పట్ల స్పష్టంగా ఉండరు.ఇక ప్రాక్టికల్‌ గా ఉండే అమ్మాయిలు అలా కాదు.

మాటంటే మాటే.ఒక్కసారి ఓ మాట అనేసారో, దాన్ని బట్టి ప్రవర్తించడం నేర్చుకోవాలి.

* మీ ముందున్న అమ్మాయి స్వభావాన్ని బట్టి తన అలోచన విధానాన్ని అంచనా వేయాలి.కొందరు ఇష్టాయిష్టాల కంటే పట్టింపుకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు.

అలాంటివారు ఈగోయిష్టులని కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.వారు అర్థమయిపోగానే వారికి ఎంత దూరం జరిగితే అంత మంచిది.

* చిన్న చిన్న విషయాలని కూడా పెద్దగా చూస్తూ, అనవసర ప్రాధన్యత ఇస్తుంటే, అలాగే మీరు దగ్గరవ్వాలనుకున్న కొద్ది చులకనగా, చిన్నగా చూస్తే గ్రాంటెడ్ గా తీసుకుంటోంసనే విషయాన్ని పసిగట్టాలి.ఇలాంటివారికి కూడా దూరంగా ఉండాలి.

* కొన్నిసార్లు “మూడ్ స్వింగ్” వలన కూడా విచిత్రంగా ప్రవర్తిస్తారు అమ్మాయిలు.ఓ రెండు మూడు రోజుల తరువాత కూడా ప్రవర్తన అలాగే ఉంటే, పక్కకి తప్పుకోవడమే మంచిది.

ప్రవర్తనలో మార్పు ఉంటే, మూడ్ స్వింగ్ లో జరిగి ఉంటుందని సర్దుకుపోవడమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube