యోనిలో వీటిలో ఎప్పుడు ఉపయోగించవద్దు

యోనికి ఎక్కువగా గాలి ఆడదు.ఇక డిశ్చార్జ్ వలన దుర్వాసన రావడం, దురదగా ఉండటం, ఇంఫెక్షన్స్ రావడం చాలామంది స్త్రీలు అనుభవించే ఇబ్బందులు.

 Things One Shouldn’t Keep In Vagina-TeluguStop.com

తెలిసితెలియక ఎవరో ఇది వాడమని చెబుతారు, అది వాడమని చెబుతారు .ఉచిత సలహాలు పాటిస్తే కొన్నిసార్లు అవి దెబ్బతీయవచ్చు.ప్రచారంలో ఉన్న కొన్నిరకాల వస్తువులని యోనిపై ఉపయోగించటం ప్రమాదానికి దారితీయొచ్చు.

* చాలామంది మహిళలు యోనిలో టీ ట్రీ ఆయిల్ వాడితే యోని హైడ్రేటెడ్ గా ఉంటుందని, స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు.

కాని టీ ట్రీ ఆయిల్ వలన యోనిలో రాషెష్ రావచ్చు.

* సెక్స్ కి లూబ్రికేషన్ అవసరం.మార్కెట్లో దొరికే లూబ్రికేంట్స్ లో చాలావరకూ పారాబెన్స్, గ్లిసరిన్, పెట్రోకెమికల్స్ లాంటి కెమికల్స్ ఉంటున్నాయి.ఇవి యోనికి ఎంతో హాని కలిగించవచ్చు.

* కొంతమంది లూబ్రికేంట్స్ కి బదులుగా పెట్రోలియం జెల్లి కూడా వాడేస్తుంటారు.ఇది రకరకాలుగా ఇంఫెక్షన్స్ కి దారితీయోచ్చు.

* హాస్తప్రయోగం చేసుకోవడానికి కొన్నిరకాల ఫలాల్ని కూడా వాడుతుంటారు అమ్మాయిలు.ఇప్పుడు ఫలాలపై కూడా కెమికల్స్ వాడుతున్నారన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిది.

* యోనిలో ఇంఫెక్షన్స్ తో పోరాడడానికి పెరుగు వాడమని కొందరు, పసుపు వాడమని కొందరు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు.డాక్టర్ చెప్పింది వునడమే తప్ప, ఉచిత సలహాల జోలికు వెళ్ళకూడదు.

* వైజినల్ డౌచ్ అని మార్కెట్లో యోనిని శుభ్రపరుచుకోవడానికి లిక్విడ్స్ వదులుతుంటారు.వీటిలో వాడే కెమికల్స్‌ గురించి మాత్రం బహిరంగంగా చెప్పవు కంపెనీలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube