బరువు తగ్గాలి .. కాని అలా కాదు

ఈరోజుల్లో ఫిట్ నెస్ చాలా ముఖ్యమైపోయింది.ఒకప్పడు మన శరీర ఆకారాలని ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు.

 Things Not To Be Done While Reducing Weight-TeluguStop.com

కాని ఈరోజుల్లో కాస్త లావెక్కినా, రకరకాల కామెంట్స్ వినాల్సి వస్తోంది.అదీకాక, మనం తినే కెమికల్ తిండికి, ఫిట్ గా ఉంటేనే ఎక్కువ కాలం బ్రతకగలం.

అలాంటప్పుడు బరువు తగ్గి షేప్ లో ఉంటేనే మంచిది.కాని బరువు తగ్గేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు.

* బరువు తగ్గాలనే నిర్ణయం తీసుకోగానే, చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో ఏదైనా తినడం మానేసి జ్యూస్ తాగడం మొదలుపెడతారు.ఇది కరెక్టు కాదు.

జ్యూస్ ఎక్కువ తాగితే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కు పెరుగుతాయి.అప్పుడు శరీరం ఇన్సులీన్ ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సివస్తుంది.

అదే జరిగితే ఆకలి పెరుగుతుంది.ఆకలి పెరిగితే ఎక్కువ తినాల్సివస్తుంది.

దాంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు, బరువు తగ్గడం మానేసి ఇంకా ఎక్కువ పెరిగిపోతాం.

* కొంతమంది బరువు తగ్గాలనుకోని ఓ పూట పండ్లు, ఓపూట్ లైట్ గా ఏదైనా లిక్విడ్ ఫుడ్ తీసుకోని, ఒకేపూట గట్టిగా తింటారు.

ఇది కూడా కరెక్టు కాదు.దీనివల్ల జీర్ణక్రియ ఇబ్బందుల్లో పడుతుంది.

* బరువు తగ్గాలనుకుంటే ప్రోటీన్‌లు అవసరమే.కాని లిమిట్ లో మీ శరీరంలోకి చేరితేనే కరెక్టు.

ప్రోటీన్‌లు అతిగా తీసుకుంటే అది ఫ్యాట్ గా మారుతుంది.ప్రోటీన్ షేక్స్ వలన షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

* ఎప్పుడూ ఒకేరకమైన వ్యాయామం చేయకూడదు.పద్ధతులు మారుస్తూ ఉండాలి.

అలాగే అతిగా చేసే వ్యాయామం కూడా పనికిరాదు.

* తక్కువ నిద్రపోతే త్వరగా బరువు తగ్గుతామనే భ్రమలో ఉంటారు కొంతమంది.

బరువు సంగతి పక్కనపెడితే, నిద్రను తగ్గిస్తే ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.కాబట్టి నిద్ర మామూలుగానే 7-8 గంటలు ఉండి, టీవి, మొబైల్ తో గడిపే సమయం తగ్గించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube