Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అమ్మాయిలు ... శృంగారంలో అది వాడేముందు ఇది చదవండి -Things Girls Should Remember Before Using Lubricants For $ex

ఫోర్ ప్లేతో పెద్దగా సమస్యలు ఉండవు. భాగస్వామి శుభ్రత పాటిస్తే సరిపోతుంది, ముద్దుముచ్చట్లలో మునగొచ్చు. కాని ఇంటర్కోర్స్ అనగానే ఎక్కడలేని సమస్యలు వచ్చిపడతాయి. అంగస్తంభన, శీగ్రస్కలనం లాంటి సమస్యలు పురుషులని చుట్టుముడితే, యోని బిగుసుకుపోవడం, లేదంటే లుబ్రికేట్ కాకపోవడం వంటి సమస్యలు మహిళలని ఇబ్బందిపెడతాయి. అందుకే చాలామంది స్త్రీలు లుబ్రికేషన్ సహాయం తీసుకుంటారు. మార్కెట్లో దొరికే లుబ్రికేంట్స్ వాడతారు. ఈ ప్రాడక్ట్స్ వలన అంగప్రవేశం సులువు అవుతుంది నిజమే కాని, ఈ లుబ్రికేషన్ ఆర్టిఫిశియాల్ గా అవసరమా ? ఫోర్ ప్లేలో కొంచెం ఎక్కువ కష్టపడితే సరిపోతుంది కదా. ఎందుకంటే ఈ లుబ్రికేంట్స్ వాడటం అంటే కెమికల్స్ ని మీ మర్మాంగం దగ్గర వాడటం. అది ఎంతవరకు ఆరోగ్యకరం ? ఇవి వాడేముంది ఏ లుబ్రికేంట్ తో ఎలాంటి ప్రమాదమో చూడండి.

* కొన్ని లుబ్రికేంట్స్ ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి. అంటే వీటిని ఆల్కహాల్ కలిపి తయారుచేస్తారు. వీటివలన సమస్య ఏమిటంటే ఇవి యోనిలో ఉండే నేచురల్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. మన ఒంట్లో నేచురల్ బ్యాక్టీరియా ఉండాలి. లేదంటే యోనిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ బెడద పెరిగిపోతుంది.

Continue Reading
To Top