బాయ్ ఫ్రెండ్ తో ఇలా మాత్రం బిహేవ్ చేయొద్దు

ఈరోజుల్లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ చాలా కామన్ అయిపోయింది.అలాగే వారి మధ్య బ్రేక్ అప్ కూడా చాలా కామన్ అయిపోయింది.

 Things Girls Should Avoid Before Boyfriend-TeluguStop.com

గొడవలేమి పెద్దగా ఉండవు, పెద్దగా చేస్తారంతే.అలాగని చిన్నవేగా అనుకున్న విషయాలు అనుకున్నంత చిన్నవి కావు.

ప్రస్తుతానికైతే అమ్మాయిల బ్రేక్ అప్ కి ఎలా కారణమవుతున్నారో చూద్దాం.

* అతను మీ పద్ధతిలో నడవాలి అనుకోవడం :

అతడి అలావాట్లు, పద్ధతులు అతని ఇష్టం.మీ పద్ధతిలో అతడు ఎందుకు నడవాలి? ఈ అలవాట్లు , మాటతీరు ముందు నుంచి ఉన్నవేగా.అవి చూసి కూడా రిలెషన్ షిప్ లోకి ఎంటర్ అయ్యాక, అతడు తన పద్ధతిని మార్చుకోవాలనడం తప్పే.

కొత్తగా పుట్టుకొచ్చిన విషయాలు నచ్చకపోతే వారించడం సబబు.

* ఆటలంటే అతనికి ఇష్టం :

మగవారికి ఆటలంటే పెద్ద టైమ్ పాస్.అలాగని మీతో గడపడం ఇష్టం లేదని కాదు.క్రికెట్‌ మ్యాచ్ ఉన్నరోజు అతడిని అదే ప్రపంచంలో వదిలేయాలి.నేను ఎక్కువా? క్రికెట్ ఎక్కువా ? అనే ప్రశ్నతో బాయ్ ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టకండి.ఈ చిన్నవిషయం చాలా నెగెటివ్ ప్రభావం చూపుతుంది.

క్రికేట్ మీకంటే తక్కువే, కాని మ్యాచ్ చూడటం అతడికి ఇష్టం.

* అతడికి స్నేహితులు అవసరం :

స్నేహితులు అతని ప్రపంచంలోకి మీకన్నా ముందే వచ్చుంటారు.వారితో మాట్లాడటం, వారితో సమయాన్ని గడపటం కూడా అతనికి ఇష్టం.మీ బాయ్ ఫ్రెండ్ స్నేహితులను తిట్టుకోకండి.వారినుంచి మీ బాయ్ ఫ్రెండ్ ని విడదీయాలని చూడకండి.వారిని ఏదైనా అంటే, వారికి ఇంకా దగ్గరగా, మీకు దూరంగా వెళతాడు మీ బాయ్ ఫ్రెండ్.

* మాట్లాడనికి ఓ పద్ధతి :

నీ డ్రెస్ బాగాలేదు, అదేం హేయిర్ స్టయిల్ .నిన్ను ఇలా చూస్తే నా పరువు పోతుంది .ఇలాంటివి సున్నితంగా, అతడిని హర్ట్ చేయకుండా చెప్పొచ్చు.మాట్లాడడానికి మంచి పద్ధతి ఎంచుకోండి.

ప్రతిసారీ మీ కోరికలు తీర్చలేడు :

చివరిదైనా, అతిముఖ్యమైనది.ప్రతీసారి మీరు అడిగింది ఇవ్వడం అతని వల్ల కాదు.

అతడు కూడా కోరికలు కోరితే, మీరు ప్రతీది తీర్చగలరో లేదో ఆలోచించండి.కష్టం ఏమో అని మీ ఉహకు అనిపిస్తే, అతడ్ని, అతడి పరిస్థితులను అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube