అందానికే కాదు .. అబ్బాయిలు ఈ విషయాలకి కూడా పడిపోతారు

ఒక అబ్బాయి అమ్మాయి పట్ల ఆకర్షితుడవ్వాలంటే అందం మాత్రమే సరిపోతుందేమో.కాని అందం ఒక్కటే అబ్బాయిలు పడిపోవటానికి కారణం కాదు.

 Things Boys Fall For In Women Other Than Face-TeluguStop.com

మరెన్నో విషయాలు కూడా అబ్బాయిల మనసుని గిలిగింతలు పెడతాయి.ముఖం ఎలా ఉంది అనేదాన్ని పక్కనపెట్టి కూడా ఈ విషయాలకి పడిపోతారు అబ్బాయిలు.

అవేంటో చూద్దాం.

* తమని చూసి చిరునవ్వు చిందించే అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా ఇష్టం.

అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే ఆకర్షితుడవని మగవాడు ఉండటం దాదాపుగా కష్టం.

* తమ పేరుని అమ్మాయి ఎలా పలుకుతుందో, ఎలా పిలుస్తుందో అనే విషయాన్ని బట్టి కూడా అబ్బాయి పడిపోవటం అనేది జరుగుతుంది.

చాలామంది అమ్మాయిలకు తెలియని విషయం ఏమింటే, మగవారు సిగ్గుపడే అతి అరుదైన సందర్భం ఎప్పుడో తెలుసా? ఒక అమ్మాయి ముద్దుగా తన పేరు పిలిచినప్పుడు.

* ఊరించే అమ్మాయిల వెంటే ఎక్కువగా పడుతూ ఉంటారు అబ్బాయిలు.

ఇలా ట్రై చేయగానే అలా పడిపోతే అబ్బాయిలకు కిక్ దొరకదు.అలాగని కోపం కొద్ది దూరం పెట్టే అమ్మాయిల వెంటపడటం అందరు చేసే పని కాదు.

చిలిపిగా, చిన్నగా ఊరిస్తూ ఆశలు రేకెత్తించే అమ్మాయి కొంగు చుట్టు గిలగిలా కొట్టుకోవాల్సిందే ఏ అబ్బాయైనా.

* నవ్వుతూ, చక్కగా మాట్లాడే అమ్మాయిలకి గౌరవంతో పాటు ప్రేమను ఇస్తారు అబ్బాయిలు.

పొగరుబోతుల వెంటపడటం చాలా అరుదుగా జరిగే పని.

* తమను నమ్మి, సపోర్ట్ ఇచ్చే అమ్మాయిలను మనసున్న మగవాడైతే జీవితాంతం వదులుకోలేడు.ఇష్టం కాస్త ప్రేమగా మారిదే ఇలాంటి అమ్మాయి దొరికినప్పుడే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube