Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఈ దేశాల్లో సెక్స్ చేయమని ప్రభుత్వాలే ప్రధేయపడుతున్నాయి .. ఎందుకంటే ..?-These Countries Force Couples To Have More Sex .. Know Why?

Telugu

మన దేశంలో, చైనాలో జనాభా చాలా ఎక్కువ. ఓరకంగా చెప్పాలంటే భరించలేనంత జనాభా ఉంది. 120 కోట్లకు పైగా జనాభా మనదని 2011లోనే చెప్పారు .. మరి ఈపాటికి ఈ లెక్క ఇంకెంత దూరం వెళ్ళిందో. అందుకే, మనదేశంలో సెక్స్ చేయమని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తోంటే ఎప్పుడు చూడలేదు. చెప్తే గిప్తే, సెక్స్ తగ్గించండి అని చెప్పాలి మన ప్రభుత్వం. అయితే అన్నిదేశాల్లో స్థితిగతులు ఒకేలా ఉండవుగా, కొన్ని దేశాల్లో జంటలు సెక్స్ చేసుకోవడం అత్యవసరం అయిపోయింది, ప్రభుత్వాలే సెక్స్ చేయండయ్యా అంటూ ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే?

* సింగపూర్ లో ఫెర్టిలిటి రేట్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ. అందుకే సెక్స్ చేయండి బాబులు, రాత్రుళ్ళు నిద్రపోకండి అంటూ చెబుతోంది సింగపూర్ ప్రభుత్వం. ప్రజలకు సెక్స్ మీద ఇంటరెస్టు పెంచేందుకు ఏకంగా $1.6 బిలియన్లు ఖర్చుపెట్టిందట సింగపూర్ ప్రభుత్వం. నేషనల్ నైట్ అంటూ, పర్సనల్ అపార్ట్‌మెంట్స్ అంటూ సెక్స్ మీద బాగా ఫోర్స్ చేస్తున్నారు.

* డెన్మార్క్‌ లో కూడా జనాభా సమస్యలు ఉన్నాయి. మీకోసం కాకపోయినా, దేశం కోసం పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఒక ప్రైవేటు కంపెనీ అయితే ఏకంగా మూడు సంవత్సరాల వరకు పిల్లల పోషణ ఖర్చు మేమే చూసుకుంటాం, మీరు సమయం వృధా చేయకుండా పిల్లల్ని కనే పనిలో ఉండండి అంటూ ప్రకటించిందట.

* రష్యాలో కూడా సెక్స్ లైఫ్ పెంచండి అంటూ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించింది. సెప్టెంబర్ 12ని ఇక్కడ నేషనల్ కాన్సెప్షన్ డేగా జరుపుకుంటారంటే నమ్మండి. ఇక్కడ కిరాయికి మగాళ్ళను తెచ్చుకోని పిల్లల్ని కనే మహిళలు కూడా ఉంటారట.

* జపాన్ లో కూడా రానురాను ఫెర్టిలిటి రేట్ పడిపోతోంది. ఒక సర్వే ప్రకారం జపాన్ లో 50% జంటలు, నెలకి ఒకసారి కూడా సెక్స్ లో పాల్గొనట్లేదట. అందుకే రోబోలతో సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ప్రభుత్వం కూడా ప్రజలకి సెక్స్ మీద చైతన్యవంతులను చేసేందుకు తీవ్ర కృషి చేస్తోంది.

* మీరు నమ్మినా, నమ్మకపోయినా, సౌత్ కోరియాలో ప్రతి నెల మూడొవ బుధవారం నాడు సాయంత్రం 7 తరువాత ఆఫీసు తెరిచి ఉంచటం చట్టరీత్యా నేరం. అలా ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా ? ఈరోజుని ఫ్యామిలి డే అని అంటారు. అంటే జంటలు త్వరగా ఇంటికి వెళ్ళి సెక్స్ చేయాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎక్కువ పిల్లలని కన్నవారికి నజరానా కూడా ఉంటుందట.

* రోమానియాలో ఫెర్టిలిటి రేట్ చాలా దారుణంగా ఉంది. 1960ల్లో పిల్లలు లేని జంటల మీద జరిమానా విధించేవారట. 1980ల్లో మహిళలకి ఫోర్స్డ్ ప్రగ్నెన్సి టెస్టులు కూడా నిర్వహించేవారట. పనిచేసేందుకు మనుషులు కావాలి, జంటలేమో పిల్లల్ని ఇవ్వట్లేదు, ఇట్లాగయితే దేశం ఎట్లా బాగుపడేది అని ప్రభుత్వం ఎన్ని వింత నిర్ణయాలు తీసుకున్నా, భాగస్వాములు మంచం ఎక్కట్లేదు, దేశానికి పిల్లల్ని ఇవ్వట్లేదు పాపం.

Continue Reading

More in Telugu

 • Great news for non – Jio Prime users

  By

  మరో అయిదు రోజులు దాటితే ఇంటర్నెట్ మీద బ్రతుకుతున్న జీవితాలలో చాలా మార్పులోచ్చేస్తాయి. జియో అక్కడినుంచి తన ఉచిత సర్వీసులు పూర్తిగా...

 • A 12 year old Indian boy becomes father

  By

  12 ఏళ్ల వయసులో మనమంతా ఎలా ఉండేవాళ్ళం ? బయట ఓ పదినిమిషాలు ఆట ఆడుకోవాలన్నా కష్టంగా ఉండేది .. అట్లా...

 • Top mobile apps for your sex life

  By

  సెక్స్ లో ఎప్పటికి, అన్ని తెలుసుకోవడం కష్టం. వందలకొద్దీ సెక్స్ పొజిషన్స్, ఒక్కో అంగంలో మనకు తెలియని నరాలు, వాటి స్పందనలు,...

 • How to raise your daughter independent and strong?

  By

  కంటే కూతురనే కనాలిరా అన్నాడో సినీపెద్ద. మరి అంత వన్ సైడెడ్ అభిప్రాయం మనకెందుకు కాని, కూతురైనా, కొడుకైనా, ఓకేలా పెంచండి....

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..