వీర్యదానం చేయాలంటే ఈ కండీషన్స్ కంపల్సరి

రక్తదానం, అవయవదానం లాగానే వీర్యదానం కూడా.కాని దీని గురించి మాట్లాడటానికి సంశయిస్తారు చాలామంది.

 These Are The Conditions For Donating Your Sperm-TeluguStop.com

బ్రిటన్‌లో అయితే మనం ఇక్కడ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినట్లు, వీర్యదాత నుండి వీర్యాన్ని ఆర్డర్ చేసే మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసాయి.కాని మనదేశంలో ఇంకా వీర్యదానం ప్రాచుర్యం పొందలేదు.

విక్కిడోనార్ లాంటి సినిమా వస్తే తప్ప వీర్యాన్ని కూడా దానం చేస్తారని తెలియలేదు మనలో చాలామందికి.కాని వీర్యదానం చాలా గొప్ప విషయం.

సంతానలేమితో బాధపడుతున్నవారికి గొప్ప వరం ఇది.వీర్యాన్ని ఊరికే ఏం దానం చేయక్కరలేదు.ఒక్కసారి వీర్యాన్ని ఇచ్చినందుకు వేల్లల్లో సంపాదించుకోవచ్చు.కాని మీరు గనుక దానం చేయాలనుకుంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయి.

* వీర్యదాత వయసు 40 ఏళ్ళకు మించకూడదు.ఆపై వయసులో ఉన్నవారి వీర్యంలో ఫెర్టిలిటి పడిపోతుంది.

కాబట్టి 40 ఏళ్ళకు తక్కువ ఉన్నవారి వీర్యాన్నే తీసుకుంటారు.

* వీర్యాన్ని దానం చేసే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉండాలి.

అతడికి HIV, క్యాన్సర్, డయాబెటిస్, హెపటైటిస్ బి,సి, జననాంగల్లో ఇంఫెక్షన్స్ లాంటి సమస్యలు ఉండకూడదు.

* సహజంగానే ఎత్తు ఎక్కువున్న పిల్లలు కలగాలని కోరుకుంటారు ఎవరైనా.

ఇక్కడ వీర్యాన్ని భార్యభర్తలు ఎన్నుకుంటారు కాబట్టి పొడవుగా ఉన్న దాతలవైపే మొగ్గు చూపుతారు.ఇలాంటి సందర్భాల్లో వీర్యదాత పొడవుగా ఉండటం కూడా ముఖ్యం.

* మీరు వీర్యదాతగా పనికొస్తారు అని తెలిసాక, వీర్యాన్ని దానం చేసే 3-4 రోజుల ముందు నుంచి హస్తప్రయోగానికి, సెక్స్ కి దూరంగా ఉండాలి.ఎందుకంటే వీర్యం దానం చేసేటప్పుడు అది పల్చగా కాని, నాణ్యత తక్కువగా కాని ఉండకూడదు.

* స్వలింగ సంపర్కుల వీర్యం అమ్ముడుపోవు.ఇలాంటివారు క్లినిక్ టెస్ట్ పాస్ అవడం కూడా కష్టమే.

ఎందుకంటే వీరికి సెక్సువల్ ఇంఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube