ఇంటర్నెట్ లో ఈ పనులు చేసారో .. జైల్లో వేస్తారు

ఇంటర్నెట్ ప్రపంచాన్ని దగ్గర చేసింది.చిన్నగా కూడా చేసింది.

 These Acts On Internet Can Make You Sit In Jail-TeluguStop.com

ఇక మనషులని బద్ధకస్తులగానే కాదు, ఆకతాయిలని కూడా చేసింది.మన ఇంట్లో కంప్యూటర్ లేదా మొబైల్ ముందు కూర్చోని మనం ఏం చేసినా చెల్లుతుంది అని మాత్రం అనుకోవద్దు.

మీరు చేసే తప్పులకి మిమ్మల్ని పట్టుకోవడం ఏమంత కష్టమైన పని కాదు .చెప్పాం కదా, ఇంటర్నెట్ ప్రపంచాన్ని చిన్నగా చేసింది.సింపుల్ గా, అవసరానికి వాడుకోండి కాని ఈ పనులు మాత్రం చేయొద్దు .సీదా జైలుకే వెళతారు.

* అప్పట్లో ఓ పార్టీ లీడర్ ని (పేరు వద్దు) ఫేస్ బుక్ లో విమర్శించారని ఇద్దరు అమ్మాయిలను అరెస్ట్ చేసారు.కాబట్టి ఒకరిపై విమర్శలు చేసేముందు కూడా ఆలోచించుకోండి.

* టొరెంట్ ఫైల్ లేదా పైరసీని మీ మిత్రులకి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు అనుకుండి .ప్రమాదంలో దాదాపుగా ఇరుక్కున్నట్లే .కాపి రైట్ చట్టం కింద మీ మీద కేసు బుక్ అవుతుంది.

* చైనాలో అమ్మాయిలు కవ్విస్తూ అరటిపండు తింటూ వీడియోలు పెట్టడం నిశిద్ధం.

ఆమధ్య ఇరాన్ ప్రభుత్వం అసభ్యకర నృత్యాలు చేసినందుకు ఓ గుంపుని కొరడా దెబ్బలతో శిక్షించింది.మన దగ్గర అలాంటి రూల్స్ ప్రస్తుతానికైతే లేవు కాని, ఎవరో ఒకరికి మీ వీడియో అసభ్యకరంగా అనిపించి కోర్టుకెళితే?

* థాయ్ లాండ్ లో రాజుకి వ్యతికరేకంగా రాస్తే శిక్ష తప్పదట.థాయ్ లాండ్ కి వెళ్ళే మీ స్నేహితులకి చెప్పండి ఈ విషయం.

* ఇతోపియాలో వాయిస్ ఒవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పై ఆంక్షలు ఉన్నాయి.

అక్కడ స్కైప్ వాడినా కష్టమే.అక్కడ కూడా స్నేహితులుంటే చెప్పండి.

* పొరపాటులో కూడా అమ్మాయిలని ఫేస్ బుక్ లో అమ్మాయిలని వేధించవద్దు.సీరియస్ గా తీసుకోని సైబర్ క్రైమ్ దాకా వెళితే అంతే సంగతులు.

* హ్యాకింగ్ చేస్తూ పట్టుపడితే శిక్ష .సాక్ష్యాలు తారుమారు చేసేందుకు హిస్టరీ చేరేపేసే ప్రయత్నాలు చేస్తే శిక్ష ఇంకా పెరగవచ్చు.

* సైబర్ బుల్లేయింగ్, అడల్ట్ కంటెంట్, ఒక వ్యక్తికి సంబంధించి ఫేక్ ఐడి క్రియేట్ చేయడం .ఇవన్ని బొక్కలో బుక్ చేసే పనులే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube