Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

ఇంటర్నెట్ లో ఈ పనులు చేసారో .. జైల్లో వేస్తారు-These Acts On Internet Can Make You Sit In Jail

Featured

ఇంటర్నెట్ ప్రపంచాన్ని దగ్గర చేసింది. చిన్నగా కూడా చేసింది. ఇక మనషులని బద్ధకస్తులగానే కాదు, ఆకతాయిలని కూడా చేసింది. మన ఇంట్లో కంప్యూటర్ లేదా మొబైల్ ముందు కూర్చోని మనం ఏం చేసినా చెల్లుతుంది అని మాత్రం అనుకోవద్దు. మీరు చేసే తప్పులకి మిమ్మల్ని పట్టుకోవడం ఏమంత కష్టమైన పని కాదు .. చెప్పాం కదా, ఇంటర్నెట్ ప్రపంచాన్ని చిన్నగా చేసింది. సింపుల్ గా, అవసరానికి వాడుకోండి కాని ఈ పనులు మాత్రం చేయొద్దు .. సీదా జైలుకే వెళతారు.

* అప్పట్లో ఓ పార్టీ లీడర్ ని (పేరు వద్దు) ఫేస్ బుక్ లో విమర్శించారని ఇద్దరు అమ్మాయిలను అరెస్ట్ చేసారు. కాబట్టి ఒకరిపై విమర్శలు చేసేముందు కూడా ఆలోచించుకోండి.

* టొరెంట్ ఫైల్ లేదా పైరసీని మీ మిత్రులకి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు అనుకుండి .. ప్రమాదంలో దాదాపుగా ఇరుక్కున్నట్లే .. కాపి రైట్ చట్టం కింద మీ మీద కేసు బుక్ అవుతుంది.

* చైనాలో అమ్మాయిలు కవ్విస్తూ అరటిపండు తింటూ వీడియోలు పెట్టడం నిశిద్ధం. ఆమధ్య ఇరాన్ ప్రభుత్వం అసభ్యకర నృత్యాలు చేసినందుకు ఓ గుంపుని కొరడా దెబ్బలతో శిక్షించింది. మన దగ్గర అలాంటి రూల్స్ ప్రస్తుతానికైతే లేవు కాని, ఎవరో ఒకరికి మీ వీడియో అసభ్యకరంగా అనిపించి కోర్టుకెళితే?

* థాయ్ లాండ్ లో రాజుకి వ్యతికరేకంగా రాస్తే శిక్ష తప్పదట. థాయ్ లాండ్ కి వెళ్ళే మీ స్నేహితులకి చెప్పండి ఈ విషయం.

* ఇతోపియాలో వాయిస్ ఒవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పై ఆంక్షలు ఉన్నాయి. అక్కడ స్కైప్ వాడినా కష్టమే. అక్కడ కూడా స్నేహితులుంటే చెప్పండి.

* పొరపాటులో కూడా అమ్మాయిలని ఫేస్ బుక్ లో అమ్మాయిలని వేధించవద్దు. సీరియస్ గా తీసుకోని సైబర్ క్రైమ్ దాకా వెళితే అంతే సంగతులు.

* హ్యాకింగ్ చేస్తూ పట్టుపడితే శిక్ష .. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు హిస్టరీ చేరేపేసే ప్రయత్నాలు చేస్తే శిక్ష ఇంకా పెరగవచ్చు.

* సైబర్ బుల్లేయింగ్, అడల్ట్ కంటెంట్, ఒక వ్యక్తికి సంబంధించి ఫేక్ ఐడి క్రియేట్ చేయడం .. ఇవన్ని బొక్కలో బుక్ చేసే పనులే.

Continue Reading
మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

 • Genral

  Drunken Jennifer Lawrence dances half naked

  By

  జెన్నిఫర్ లారెన్స్ తెలుసా? హాలివుడ్ సినిమాలు చూసేవారికి ఈ పేరు తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే జెన్నిఫర్ లారెన్స్ చోటా...

 • Genral

  Woman called police to save her from sperm filled Thermosflask which could blow up

  By

  ఆ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. ఉండేది ఫ్లోరిడాలో. పేరు ఫేలిసియా నెవీన్ అంట. తనకి తల్లి కావాలనిపించింది. గర్భం దాల్చి...

 • Genral

  why shouldn’t we exchange salt by hand

  By

  సాధారణంగా ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఒకవేళ ఉప్పును చేతికి ఇస్తే ఆ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని పూర్వ కాలం...

 • Genral

  Hyderabad Social Media Calculation

  By

  సోష‌ల్ మీడియా! ఇప్పుడు ఈ ప‌దం తెలియ‌ని వాళ్లు లేరు. త‌మ భావాల‌ను, అభిప్రాయాల‌ను నిస్సంకోచంగా పంచుకునే ఏకైక వేదిక సోష‌ల్...

To Top