ఆ జైలులో ఉండేకన్నా .. చనిపోవడం మేలు

ఒక్కరు తినాల్సిన అన్నం నలుగురు తింటే ఎలా ఉంటుంది? నలుగురిలో ఎవరికి ఆకలి చల్లారదు.అలాంటిది 800 మందికి పెట్టాల్సిన ఆహారం 4వేల మందికి పెడుతున్నారు.800 మంది ఉండాల్సిన జైల్లో 4వేల మంది ఖైదీలను ఉంచుతున్నారు.సినిమా టికెట్ల కోసం కాసేపు ఉండే రద్దినే తట్టుకోలేక ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నాం మనం.కాని ఆ జైలులో ఖైదీలు ప్రతీరోజు రద్దీలోనే గడపాలి.

 There Is A Jail In Philippines, Which Resembles Hell-TeluguStop.com

కూర్చోవడానికి వీలు కాదు.

ఒక్కోసారి పడుకోవడానికి స్థలం దొరకదు.ఇరుకుగా ఉన్నా, కాళ్ళు చేతులు ముడుచుకోని పడుకోవాలి.

లేదంటే కొన్ని గంటలు నువ్వు, కొన్ని గంటలు నేను పడుకుంటా అని దొరికిన స్థలాన్ని ఇద్దరు వాడుకోవాలి.స్నానానికి చోటు దొరక్కపోతే ఎక్కడపడితే అక్కడే స్నానం చేయాలి.

ఒక్కోసారి బట్టలు వంటగదిలో ఉతుక్కోవాల్సి వస్తుందేమో.ఆహారం సరిపోదు, పస్తులున్నామని అడ్జస్ట్ చేసుకోవాలి.

నిద్ర సరిగా లేక ఆరోగ్యం పాడవుతుంది.రోజూ ముడుచుకోని పడుకోవటం వలన కీళ్ళ నొప్పులు, ఎముకలు దెబ్బతినటం జరుగుతుంది.చుట్టూ రకరకాల మనుషులు చెమటకంపుతో రోజంతా ఉండటం వలన ఇంఫెక్షన్స్ వస్తాయి.జ్వరం వస్తుంది, దురదృష్టవశాత్తు ఏవేవో వ్యాధులు వస్తాయి.

కాని వైద్యం అందుబాటులో ఉండదు.ఏం జరిగినా, అక్కడే చావాలి.

ఉఫ్ … ఇంత భయంకరమైన జైలుని ఎక్కడైనా చూసారా? ఇలాంటి జైలు ఫిలిప్పీన్స్ లోని కుజాన్ సిటిలో ఉంది.దీన్ని జైలు కాదు, భూమ్మీద ఉన్న నరకం అని అంటారు అక్కడి ఖైదీలు.

ఒక్కసారి ఆ జైలుకి వెళితే, జీవితం మీద విరక్తి పుట్టి, మృత్యువు మీద ప్రేమ పుడుతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube