టాలీవుడ్ ను షేక్ చేస్తున్న "చిన్న" సినిమా!!

టాలీవుడ్ లో బడా హీరోలు సైతం ప్రస్తుతం 50.100 రోజులు అనే కాన్సెప్ట్ ను మరచిపోయి కలక్షన్స్ పైనే ఆధారపడి సినిమాలు చేస్తున్నారు.అయితే అలాంటి బడా హీరోల సినిమాలు సైతం భారీ హిట్ కొట్టినప్పటికీ మొదటి వారం మినహా రెండో వారంలోకి అడుగుపెట్టేసారికి థియేటర్స్ లో సగానికి పైగా ఖాళీలు ఏర్పడుతూ ఉండటం అందరికీ తెలిసిందే.అయితే ఇలాంటి పరిస్థితుల్లో సైతం “ది ఎండ్” అనే ఒక చిన్న సినిమా.

 “the End” Movies Shakes Tollywood-TeluguStop.com

కేవలం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సినిమా టాలీవుడ్ ను షేక్ చేస్తుంది.సినిమా విడుదలై మూడు వారాలు కావొస్తున్నా సునామీ కలక్షన్స్ తో దూసుకుపోతుంది.ప్రముఖ టీవీ ఛానెల మా టీవీ వారు నిర్వహించ “షార్ట్ ఫిల్మ్” కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన రాహుల్ నూతన నటీనటులతో ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా హర్రర్ కధను తెరకెక్కించాడు.సస్పెన్స్ థ్రిల్లెర్ గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ను ప్రధానంగా ఆకట్టుకుంటుంది.

పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా ఇప్పటివరకు 7కోట్ల రూపాయలు వసూలు చేయడం గమనార్హం.ఇక ఈ చిత్రం తెలుగులో విజయం కావడంతో అటు కన్నడ, తమిళ భాషల్లో సైతం ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని మరో సారు ఈ చిత్రం రుజువు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube