ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి

తినే ఆహారం బాగా ఎంచుకోని తినాలి.సరైన నూనే వాడకపోవడం వలన, సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం వలన ఎదురుకునే ప్రధాన సమస్య బాడిలో ఫ్యాట్ పెరగటం.

 The Disadvantages Of Excess Fat In Body-TeluguStop.com

అంటే కొవ్వు శాతం పెరగటం.కొవ్వు వలన ఎన్ని ఇబ్బందులో చూడండి.

* గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణంగా కొవ్వు పెరగటాన్ని చెప్పవచ్చు.అధిక కొవ్వు ఎప్పుడూ గుండెని సరిగా పనిచేయనీయదు.

* కడుపు చుట్టూ కొవ్వు ఎక్కువ జమ అయితే, రక్తప్రసరణ సరిగా జరగక, డీప్ వీన్స్ లో రక్తం గడ్డకట్టిపోవచ్చు.

* కొవ్వు అవయవాల మీద తీసుకొచ్చే ఒత్తిడి మూలాన, రక్త ప్రసరణ మీద ఒత్తిడి పెరిగి, బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుంది.

* కొవ్వు క్యాన్సర్ సెల్స్ ని కూడా పెంచేస్తుంది.బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇది కూడా ఓ కారణం.

* అధిక కొవ్వు డయాబెటిస్ రిస్క్ ని అమాంతం పెంచేస్తుంది.అబ్డామిన్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ రావడంతో ఇలా జరుగుతుంది.

* ఎంత కొవ్వు ఒంట్లో చేరితే, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాసం అంత ఎక్కువగా పెరిగిపోతుంది.

* కీళ్ళనొప్పులు రావడానికి కూడా అధిక కొవ్వు కారణమవుతుంది.

ఎలా అంటారా ? కొవ్వు పెరిగితే బరువు పెరుగుతారు.బరువు పెరిగితే జాయింట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube