Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

గర్భం కావాలనుకున్నప్పుడు మొదలుపెట్టాల్సిన ఆహార జాగ్రత్తలు -The Diet You Should Follow After Deciding To Be A Pregnant

గర్భం దాల్చడం, ఓ ప్రాణానికి జన్మనివ్వడం, తల్లి అనిపించుకోవడం … ఈ భావోద్వేగాలే స్త్రీ జన్మని సంపూర్ణం చేస్తాయి. అందుకే తల్లి కావడం అనేది ఓ గొప్ప వరంగా భావిస్తారు. ఆ గొప్పతనం వల్లే, అంత నొప్పిని నవమాసాలు మోస్తారు. మరి అంత గొప్ప విషయం మీ జీవితంలో జరగబోతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. గర్భం దాల్చిన తరువాత కాదు, ఇక నేను తల్లిని కావాలనుకుంటున్నాను అని డిసైడ్ చేసుకోగానే ఆహరం విషయంలో కొన్ని జాగ్రత్తలు మొదలుపెట్టాలి. అవేంటో చూడండి.

ముందు ఒక న్యూట్రీషన్ ఎక్స్ పర్ట్ ని కలవండి. మీ బిఎంఐ ఎంత ఉందొ, ఎంత ఉండాలి కనుక్కోండి. దానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్ చేసుకోండి. గర్భం దాల్చిన తరువాత బరువు సమస్యలు మొదలైతే ఇబ్బంది కదా. అందుకే ముందు నుంచే ఓ ప్లాన్ వేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ఆహరం తీసుకోవద్దు. మితంగా, డైట్ ని విభజించుకొని తినాలి. ఒక్కసారి ఎక్కువ తింటే కొవ్వు జమ అవుతుంది. గర్భిణి స్త్రీకి కొవ్వు సమస్యలు ఉండకూడదు.

పండ్ల రసాలు తక్కువ తాగండి. వాటిలో పీచు ఉండదు. షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. అందుకే పండ్లని అలానే తినడం మొదలుపెట్టండి. పండ్లని బాగా శుభ్రం చేసి తినండి. సాధ్యమైనంతవరకు పండ్లని మార్కెట్ లో కొనకుండా, చుట్టాల దగ్గరి నుంచి పల్లెటూరిలో స్వచ్చంగా పండిన ఫలాలని తెప్పించుకోండి. మీకు అలర్జేటిక్ గా అనిపించే ఆహారాల జోలికి వెళ్ళవద్దు. గర్భం దాల్చిన తరువాత రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు నుంచి ఐరన్ ఉండే ఆహరపదార్థాలపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో హిమోగ్లోబిన్ శాతం అస్సలు పడిపోకూడదు. ఆలాగే ఒంటికి ఆక్సిజన్ కూడా ముఖ్యం. కాబట్టి ఐరన్ ని మరవొద్దు.

బాగా ఉడికించి వండిన మాంసాన్నే తినండి. ప్రోటీన్స్ మీకు అవసరం. అలాగే ఫోలిక్ ఆసిడ్ కూడా ఈ సమయంలో అవసరం. కాబట్టి సీఫుడ్ తినండి. గ్రీన్ వెజిటబుల్స్ ని డైట్ లో ఉంచుకోండి. రెడ్ మీట్, పౌల్ట్రీ చికెన్ తో కొంచెం జాగ్రత్త. మితంగా తినండి. ఎముకలు బలంగా ఉండాలి కాబట్టి కాల్షియం ఉండే ఆహారపదార్థాలు తినండి. డీ హైడ్రేట్ అవకుండా నీళ్ళు బాగా తాగండి. ఇక మద్యపానం, కాఫీ అలవాట్లు ఉంటే కొన్నినెలలు పక్కనపెట్టండి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Health

 • Health

  Amazing Benefits of eating Tamarind

  By

  చింతపండు చాలా ప్రాచీనమైనది. ఎంతలేదన్న 5000 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పండిస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. చింతపండుని మనం పులుపు కోసం...

 • Health

  Does eating potatoes make you gain weight?

  By

  బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. బంగాళాదుంపతో చిప్స్,వేపుడు, కూర‌,...

 • News

  Does over-eating of Mango cause boils ?

  By

  Mango is inarguably the most loved fruit in the world. It is called as the king...

 • Health

  Healthy Benefits of Turmeric

  By

  మన పూర్వీకుల కాలం నుండి పసుపును వంటకాల్లో వాడుతూ ఉన్నాం. వంటకాలకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది....

To Top