Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ డెసిష‌న్ ఏంటి..!-That Family Future In The Hands Of Jagan ..!

ఏపీలో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు కీల‌క జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఈ జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాల‌తో పాటు 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక్క‌డ మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే ఏపీలో అధికారంలోకి రావ‌డం ఆన‌వాయితీగా ఉంటూ వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగా వేసేందుకు అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ హోరాహోరీగా ఫైట్ చేస్తున్నాయి.

ఈ జిల్లాలో మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇప్పుడు జ‌గ‌న్ చేతుల్లో ఉంది. వీరి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడు ? వీరికి ఏ నియోజ‌క‌వ‌ర్గం కేటాయిస్తాడు ? అన్న‌ది ఇప్పుడు తూర్పు పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం జక్కంపూడి రామ్మోహన రావు రాజకీయ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ రాజా నగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. రామ్మోహ‌న్ అనారోగ్యానికి గుర‌య్యాక ఆయ‌న వార‌సురాలిగా ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మి 2009లో రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Continue Reading
More Posts
To Top