టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ సినిమా విడుదలకు ముస్తాభవుతోంది.మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మరింత గ్లామర్ అద్దేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క మరియు తమన్నాల వంటి ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు.అయినా మరో ముద్దుగుమ్మను ఈ సినిమాలో పెట్టి ప్రేక్షకులతో సూపర్ అనిపించేందుకు జక్కన్న ప్రయత్నిస్తున్నాడు.
ఇటీవల ‘టెంపర్’ చూపించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ‘బాహుబలి’ సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.ఈ అమ్మడు తన గ్లామర్‌తో సినిమాకు మరింత అందంను తీసుకు వస్తుందని సినీ వర్గాల వారు అంటునన్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 15న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాజమౌళి ప్రకటించాడు.దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.