తెలుగు '96' అప్‌డేట్‌ వచ్చేసిందండోయ్‌

తమిళంలో వచ్చిన 96 చిత్రం సెన్షేషనల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు చేసి 2018 సంవత్సరంలో తమిళనాట స్టార్‌ హీరోల చిత్రాల సరసన నిలిచింది.

 Telugu 96 Latest Update-TeluguStop.com

టీవీల్లో ప్రసారం అయిన తర్వాత కూడా థియేటర్లకు జనాలు వచ్చి చూసిన సినిమా ఇదే అంటూ తమిళ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.అంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 96 ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

తెలుగు రీమేక్‌ కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Sharwanandhadn, Tamil, Telugu, Telugu Latest, Vijaysethupathi-

దిల్‌రాజు బ్యానర్‌లో ఈ చిత్రం రీమేక్‌ అవుతుంది.శర్వానంద్‌ మరియు సమంత జంటగా ఈ చిత్రం రూపొందుతుంది.తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌ కుమార్‌ తెలుగు వర్షన్‌కు కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు.

ఈ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అన్నారు.కాని ఏదో కారణం వల్ల సినిమా చాలా స్లోగా పూర్తి చేశారు.షూటింగ్‌ ఒకటి రెండు వారాల్లో పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.టైటిల్‌ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకుండా ఇన్ని రోజులు సస్పెన్స్‌ పెట్టారు.

Telugu Sharwanandhadn, Tamil, Telugu, Telugu Latest, Vijaysethupathi-

ఎట్టకేలకు టైటిల్‌ పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు.జాను అంటూ ఈ చిత్రంకు టైటిల్‌ను ఖరారు చేశారు.ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.శర్వానంద్‌ ఈ ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తున్నాడు.సమంత ఫస్ట్‌లుక్‌ కూడా మరికొన్ని గంటల్లోనే విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ చిత్రంను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతుంది.

కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు.పూర్తి వివరాలు అతి త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube