కుర్ర హీరోయిన్ పై మనసు పారేసుకున్న సీనియర్ డైరెక్టర్

ఆయనొక సీనియర్ డైరెక్టర్.చాలా అంటే చాలా సీనియర్.

అగ్రహీరోలని డైరెక్ట్ చేశాడు.వారితో హిట్లు కొట్టాడు, ఫ్లాప్స్ కూడా పడ్డాయి.

అయితే, జయాపజయాలతో తేడా లేకుండా, ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది తెలుగు సినిమా ప్రపంచంలో.ప్రస్తుతం పునర్వైభవం వెతుక్కునే పనిలో భారి బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

అందులో చాలా తక్కువ అనుభవం ఉన్నా, సక్సెస్ ఉన్న ఒక యంగ్ హీరోయిన్ నటిస్తోంది.తెలుగింటి అందంలా కనిపించే ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది.

ఇటివలె ఒక అగ్రహీరో సరసన జోడి కట్టింది కూడా.

ఆ అందమైన హీరోయిన్ పై మన సీనియర్ డైరెక్టర్ మనసు పారేసుకున్నాడట.

తనకంటే సీనియర్ హీరోయిన్లను పట్టించుకోకుండా, ఈ హీరోయిన్ వెనకే ఎందుకు పడుతున్నాడో అంటూ ఫిలింనగర్ ప్రజానీకం గాసిప్పులు పెడుతున్నారు.

మొన్న, ఒక సీనియర్ నటుడు ఇచ్చిన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పార్టీలో, ఆ హీరోయిన్ పట్ల మన దర్శకుడికి ఉన్న ఫిలింగ్స్ స్పష్టంగా కనిపించాయి అని సమాచారం.

మరి ఆ హీరోయిన్ కి ఈ విషయం తెలుసో, తెలిసినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే భయంతో ఏం అనట్లేదో, అలా కాకుండా, తనకి కూడా సమ్మతంగానే ఉందో, ఈ విషయాలు మాత్రం తెలీదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube