2016 లో బ్రతుకుతున్న అనాగరికులం ఏమో మనం.చదువు సంధ్య నుంచి ఉద్యోగం ఎలా సంపాదించాలో మాత్రమే నేర్చుకొని, పరిణితి, విచక్షణ లాంటి గుణాలని భూస్థాపితం చేస్తున్న వెర్రిబాగులం ఏమో మనం.
ఇక్కడ “ప్రత్యేకంగా” మనం అంటే తెలుగువారు.
అక్కడ 21 ఏళ్ళకే దేశానికి మంచి పేరు తెస్తూ, తన కన్నా మెరుగైన ర్యాంకర్లను ఓడిస్తూ, ప్రపంచవేదికపై భారతపటం రెపరెపలాడేలా వెండి పతకం సాధించుకువచ్చింది పి.వి.సింధు.మొదట తాను భారతీయురాలైనందుకు గర్వపడాలి.తెలుగు భాష మాట్లాడే మనిషి కాబట్టి కొద్దిగొప్పో ప్రత్యేక అభిమానం చూపించవచ్చేమో .కాని తన ప్రాంతం ఏమిటి .తన కులం ఏమిటి ? ఇదీ మన తెలుగువారు పట్టించుకున్న విషయాలు.
పివి.సింధు తండ్రిది తెలంగాణాలోని నిర్మల్.తల్లిది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ.పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.ఇక తను తెలంగాణ అమ్మాయా లేకా ఆంధ్రప్రదేశ్ అమ్మాయా అనేది పట్టించుకునే వారికే వదిలేయాలి.అది పక్కనపెడితే తెలుగువారి కులపిచ్చి దేశవ్యాప్తంగా మరోసారి బయటపడింది.
“PV Sindhu caste” అని నిన్న 9 లక్షలమంది గూగుల్ లో సెర్చ్ చేసారంట.గత 7 రోజుల్లో సింధు కులం గురించి వెతికిన ప్రదేశాల్లోని ఇంటరెస్ట్ స్టాట్స్ చూస్తే ఏకంగా 100 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణ 42, హర్యానా 18, కర్ణాటక 15, తమిళనాడు 14 తరువాతి స్థానాల్లో నిలిచాయి.ఫైనల్ కి ముందురోజు వరకు లెక్క తీసుకుంటే, సింధు కెరీర్ కన్నా సింధు కులం గురించి వెతికిన వారే ఎక్కవంట.
అదండి .ఈరకంగా గూగుల్ విడుదల చేసిన ఫలితాల్లో తెలుగువారి కులపిచ్చి దేశవ్యాప్తంగా మరోసారి తెలిసిపోయింది.