తెలుగు లో సౌకార్యమే వేరు అంటున్న బ్యూటి

బాలివుడ్ నుంచి టాలివుడ్ కి దిగుమతి అయిన మరో ముద్దుగుమ్మ అదా శర్మ.మొదటి చిత్రం “హార్ట్ ఎటాక్” తోనే కుర్రాళ్ళకి హార్ట్ ఎటాక్ ఇచ్చింది.

 Telugu Cinema Is Much Comfortable Says Adah Sharma-TeluguStop.com

తెలుగులో వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటున్న ఈ అమ్మడుకి ఇక్కడి వాతావరణం తెగ నచ్చేసిందట.తెగ పోగిడేస్తోంది ఇక్కడి వాళ్ళని

“రెండు రంగాలూ చాలా సౌకర్యంగా ఉంటాయి.

కాకపోతే ఒక్కటే తేడా, బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకి చాలా నెలల కాలం పడితే దక్షిణాదిలో మూడు నాలుగు నెలల టైమ్‌లో క్వాలిటీ సినిమా తయారైపోతుంది.ఇక్కడ చాలా ఫాస్ట్‌ ఫాస్ట్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది.

డేట్లు ఎక్కడా వేస్ట్‌ కావు.ఇదే ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం.

మంచి విషయం ఏమిటంటే ఇక్కడ హీరోయిన్ ని సెట్ లో రాణిలా చూసుకుంటారు, చాలా గౌరవిస్తారు .బాలివుడ్ లోను బాగానే చూసుకున్నా, ఇక్కడున్న సౌకార్యమే వేరు ” అంటూ చెప్పోకోచ్చింది అదా.వచ్చే వారం అదా ఒక పాత్ర పోషించిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ విడుదల కానుంది .ఈ సందర్భంగా ఆ చిత్రం గురించి మాట్లాడుతూ ” ఈ సినిమాలో నాది ప్రత్యేకమైన పాత్ర.పల్లెటూరి అమ్మాయి పాత్ర.పాత్ర నిడివి తగ్గినా మంచి గుర్తింపు ఉన్న పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పేసాను.సాయి ధరమ్‌ తేజ్‌ ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే! తెర మీద ఎలా ఉంటాడో, తెర వెనుక అంటే నిజజీవితంలో కూడా అలాగే ఉంటాడు.ఇక రెజీనా నాకు మంచి ఫ్రెండ్‌ అయిపోయింది.మొత్తానికి ముగ్గురం కలిసి షూటింగ్‌ సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాం.” అంటూ ముగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube